Advertisementt

శృతి రాని లోటును హాట్ గా కవర్ చేసింది..!

Mon 20th Mar 2017 08:36 PM
shruti haasan,manasa himavarsha,katamarayudu pre release evet  శృతి రాని లోటును హాట్ గా కవర్ చేసింది..!
శృతి రాని లోటును హాట్ గా కవర్ చేసింది..!
Advertisement
Ads by CJ

సహజంగా ఏ వేడుకలోనైనా నారీమణుల అందాలే ఆ ఫంక్షన్ కు నిండుదనాన్ని తెస్తాయనడంలో ఏమాత్రం సందేహం లేదు. అటువంటి పసందైన అందాల ఆరపోతను విందులా ఎప్పటికప్పుడు ప్రేక్షకులకి వడ్డించడానికి నాయికామణులు కాచుకొని ఉంటుంటారు. అలా వారి క్రేజ్ ను పెంచుకొనేందుకు వేడుకలను వాహికలుగా చేసుకుంటుంటారు. అలాగే కాటమరాయుడు ఆడియో వేడుకకు సెంట్రాఫ్ అట్రాక్షన్ గా నిలిచింది మానస హిమవర్ష. 

కాటమరాయుడు ప్రీ రిలీజ్ ఫంక్షను, అలాగే పవన్ కళ్యాణ్ 20 యేళ్ళ సినీమహోత్సవం రెండూ చాలా సింపుల్ గా నిర్వహించాలని భావించారు చిత్రయూనిట్. ఈ వేడుకకు సుందరీమణి శృతి హాసన్ పనిలో బిజీ కావడంతో తాను రావడం లేదని ముందే వెల్లడించింది. అయితే శృతిహాసన్ జిగేల్ మనిపించే అందాలు మిస్సవ్వాల్సి వచ్చిందే అంటూ అభిమానులు తెగ ఫీలయ్ పోయారు. అయ్యో శృతీ రావడం లేదా అంటూ అభిమానులు తెగ కలవరపాటుకు గురయ్యారనే చెప్పాలి. 

కానీ అటువంటి మెరుపులాంటి అందాలతో శృతి రాని లోటును భర్తీ చేసేలా, ప్రేక్షకులను కనువిందును అందించేలా ప్లాన్ చేసింది చిత్రబృందం. ఈ లోటును మన తెలుగు నారీమణి భర్తీ చేసిందనే చెప్పాలి. బస్ స్టాప్ సినిమా ద్వారా తన నటనను పండించింది హీరోయిన్ మానస హిమవర్ష. ఆ తర్వాత  కొన్ని సినిమాలు చేసినా పెద్దగా గుర్తింపు రాలేదు కానీ..పవన్ కళ్యాణ్ కాటమరాయుడు సినిమాలో ఛాన్స్ మాత్రం కొట్టేసింది. పవన్ సరసన హీరోయిన్ గా కాదుగానీ.. కాటమరాయుడులో పవన్ కళ్యాణ్ కు తమ్ముడికి జంటగా ఈమె నటించింది. 

అయితే ఈ తెలుగు అమ్మడు శృతి హాసన్ రాకపోవడంతో కాటమరాయుడు ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ లో తెగ రెచ్చిపోయే అందాలతో ప్రేక్షకులకు కనువిందు చేసేసిందనుకో. మానస తన అందాలతో వేడుకకు గ్లామర్ లేని లోటును తీర్చేందుకు ప్రయత్నించిందనే చెప్పాలి. మొత్తానికి మానస కత్తిలాంటి లుక్ తో కుర్రకారును మనసు దోచుకుందనే చెప్పాలి. పవన్ చిత్రంలో నటించిన ఈ ముద్దుగుమ్మ ఇలా పబ్లిసిటీ అవకాశాన్ని కూడా ఒకేసారి అందుకుంది. మరి ఈ చిత్రం తర్వాత మానస.. సినీ పరిశ్రమలో ఎలాంటి అవకాశాలు అందుకోనుందో చూద్దాం.  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ