సూపర్ స్టార్ రజినీకాంత్ తాజాగా '2.0' లో నటిస్తున్న విషయం తెలిసిందే. డైరెక్టర్ శంకర్ భారీ అంచనాలతో తెరకెక్కిస్తున్న '2.0' లో రజినీకాంత్ కి జోడిగా అమీ జాక్సన్ నటిస్తుంది. బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ పవర్ ఫుల్ విలన్ రోల్ లో కనిపించనున్న ఈ చిత్రం పై అంచనాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. ఇక ఈ చిత్రం తర్వాత రజినీకాంత్ నెక్స్ట్ ప్రాజెక్ట్ కూడా అప్పుడే లైన్లోకొచ్చేసింది. రజినీకాంత్ అల్లుడు ధనుష్ నిర్మాతగా కబాలి డైరెక్టర్ రంజిత్ పా డైరెక్షన్ లో రజినీకాంత్ నటిస్తాడట. ఇక ఈ చిత్రంలో రజినీకి జోడిగా బాలీవుడ్ హీరోయిన్ ఫైనల్ అయ్యిందనే వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది.
రజినీకాంత్ కి జోడిగా 'డర్టీ పిక్చర్' తో లైమ్ టైంలోకొచ్చిన విద్యాబాలన్ ని సెలెక్ట్ చేసినట్లు వార్తలొస్తున్నాయి. ఇప్పటికే ధనుష్ మరియు రంజిత్ పా విద్యాబాలన్ తో చర్చలు జరుపుతున్నట్లు వార్తలు జోరుగా ప్రచారం జరుగుతున్నాయి. ఈ చిత్రంలో తమిళ సీనియర్ హీరోయిన్ ఖుష్బూ కూడా ఒక కీలక పాత్రలో నటించనుందని సమాచారం.
రజినీకాంత్ 'రోబో' చిత్రం దగ్గర నుండి బాలీవుడ్ హీరోయిన్స్ తోనే జోడి కడుతున్నాడు. 'రోబో' లో ఐశ్వర్య రాయ్ తో నటించిన రజినీ, కొచ్చడయాన్ లో దీపికా పదుకునే, 'లింగా' లో సోనాక్షి సిన్హా, కబాలి లో రాధికా ఆప్టే తో జత కట్టాడు. ఇక ఇప్పుడు విద్యాబాలన్ కూడా ఒకే చెప్పేస్తే రజిని మరో బాలీవుడ్ హీరోయిన్ తో జోడి కట్టినట్లు అవుతుంది. విద్యాబాలన్, రజినీ చిత్రంలో నటిస్తుందని అధికారికంగా ప్రకటించాల్సి వుంది.