Advertisementt

మాజీ ప్రియుడే విలన్ గా నయన తార బొమ్మ.!

Sun 19th Mar 2017 11:42 PM
nayantara,prabhudeva,prabhudeva villain role,nayan new movie  మాజీ ప్రియుడే విలన్ గా నయన తార బొమ్మ.!
మాజీ ప్రియుడే విలన్ గా నయన తార బొమ్మ.!
Advertisement
Ads by CJ

దక్షణ భారత సినీ పరిశ్రమలోనే తన అందంతో గొప్ప అభినయాన్ని చాటి అద్భుతమైన నటనతో ముందుకు దూసుకుపోతున్న నారీరత్నం నయన తార.  నయనతార ముచ్చటగా ముగ్గురుతో ప్రేమ విఫలమైనా అంతే నిబ్బరంతో ఏమాత్రం దిగాలు లేకుండా సినిమాలే లోకంగా చిత్ర పరిశ్రమలో దూసుకుపోతుందీ బ్యూటీ కుట్టి. నయనతార అందం చెప్పనలవి కానిది అంటుంటారు సినీలోకం. అందుకే నయన తార గురించే ఏ వార్త వచ్చినా అస్సలు ఆగకుండా అలా చాలా ఫాస్ట్ గా వైరల్ అయిపోతూ ఉంటుంది. సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ గా అమిత క్రేజ్ సంపాయించుకున్న నయనతార తాజాగా తన అభిమానులకు సైతం దిమ్మతిరిగే వార్త ఒకటి హల్ చల్ చేస్తుంది. మొన్నటి వరకు ప్రేమాగీమా అంటూ తెగ తిరిగేసీ ఆ తర్వాత అది కాస్త బెడిసికొట్టడంతో ఎడమొహం పెడమొహంగా ఉన్న నయనతార, ప్రభుదేవా ఇద్దరూ ఇప్పుడు కలిసి నటించబోతున్నారని సమాచారం అందుతుంది.  అదీ నయనతారకు విలన్ గా ప్రభుదేవా పాత్ర పండబోతుందంటూ వార్తలు వస్తున్నాయి. ఇదే నిజమైతే ఒకప్పుడు మంచి ప్రేమికులుగా వెలిగిపోయిన ఈ జంట ఆ తర్వాత విరహం ఎక్కువై పోయి ఇరువురూ ఒకరికొకరు విలన్ గా మారిపోయారంటూ అప్పుడే నెటిజన్ల నుండి సెటైర్స్ పేలిపోతున్నాయి.    

అయితే వీరిద్దరి మధ్య ప్రేమ, పెళ్లి పీటల వరకూ వెళ్ళి ఆగిపోయిన విషయం తెలిసిందే. అయితే నయనతార- ప్రభుదేవా కొంతకాలం తర్వాత మనస్ఫర్ధల కారణంగా పూర్తిగా విడిపోయారు.  తాజాగా నయనతారతో ఓ సినిమాలో నటించేందుకు ప్రభుదేవా అంగీకరించినట్లు తెలుస్తుంది. అది కూడా అలాంటిలాంటి రోల్ లో కాదట. గొప్ప విలన్ రోల్ అని తెలుస్తుంది. హీరోయిన్ ప్రధానంగా సాగే ఈ కథలో ప్రభుదేవా విలన్ రోల్ పోషిస్తున్నట్లు తెలుస్తుంది. బిల్లా-2 ఫేమ్ చక్రి తోలేటి దర్శకత్వంలో కొలైయుధీర్ కాలం అనే సినిమా తెరకెక్కబోతుంది. ఇది ఫిమేల్  ఓరియెంటెడ్ చిత్రం. అయితే ఈ చిత్రం తాలూకూ  హిందీ వెర్షన్ లో తమన్నా నటించబోతుంది. అయితే ఈ హిందీ వర్షెన్ లో తమన్నాకు విలన్ గా ప్రభుదేవా నటించనున్నట్లుగా ఇప్పటికే అందిన సమాచారం.  

అయితే తాజాగా ప్రభుదేవాను తమిళ్ వెర్షన్ లో కూడా విలన్ గా చేయమని చిత్రబృందం కోరిందట. అందుకు ప్రభుదేవా కూడా అంగీకరించినట్లుగా తెలుస్తుంది. తమిళ్ లో నయనతార హీరోయిన రోల్ పోషించనుందని సమాచారం. అయితే ప్రొఫెషన్ పరంగా చాలా ప్రొఫెషనల్ గా వ్యవహరించే నయనతార కూడా ప్రభుదేవా విలన్ అయినా ఏ మాత్రం అభ్యంతరం చెప్పలేదని తెలుస్తుంది. ఇక ఇద్దరికీ అంగీకారం కుదిరినప్పుడు వీరికి అడ్డు ఇంకెవరుంటారు. అయితే గియితే ప్రభుదేవా భార్య రామలత అభ్యంతరం వ్యక్తం చేయవచ్చుగానీ అంటున్నారు సినీ విమర్శకులు. అయితే వీరిద్దరి మధ్య ఈ సినిమా కోసం రామలత విలన్ గా మారనుందా? అనేది తెలియాల్సి ఉంది. చూద్దాం ఏం జరుగుతుందో. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ