యువ సంగీత దర్శకుడు అనూప్‌రూబెన్స్‌లో ప్రతిభకు కొరతలేదు. ఎంతో ఇన్నోవేటివ్ మ్యూజిక్ డైరెక్టర్ అతను, ఆ విషయం ఆయన ఎప్పుడో నిరూపించుకున్నాడు. ఇక 'మనం, టెంపర్, గోపాల.. గోపాల' చిత్రాలతో స్టార్స్ చిత్రాలకు సంగీతం అందించే అవకాశాలను సాధించాడు. మరలా ఈమధ్య ఆయన కెరీర్ సినిమా ట్విస్ట్‌లా మారింది. వరుస పరాజయాలు ఎదురయ్యాయి. కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడింది. కానీ పవన్, డాలీల నమ్మకం వల్ల 'గోపాల గోపాల' తర్వాత మరలా అదే కాంబినేషన్‌లో రూపొందుతున్న 'కాటమరాయుడు'కు అవకాశం వచ్చింది.
ఈ చిత్రంలోని పాటలు ఒక్కొటొక్కటిగా సంచలనాలు క్రియేట్ చేస్తున్నాయి. ఇక టీజర్‌లో కూడా బ్యాగ్రౌండ్ స్కోర్ అదిరిపోయి, టీజర్‌కు మరింత హైప్‌ను, నిండుదనాన్ని, సీన్స్‌ను హైలైట్ చేసింది. దీంతో మరలా అనూప్‌రూబెన్స్ హవా మరలా మొదలైందని ఆయన శ్రేయోభిలాషులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఆడియోనే ఇంత పెద్ద హిట్టయితే, రేపు సినిమా విడుదలైన తర్వాత పెద్దతెరపై పవన్ స్టెప్స్, గెంతులు, శృతిహాసన్ మెరుపులు, డాలీ చిత్రీకరణ బాగుంటే ఇక అనూప్ టాప్‌లీగ్‌లోకి ఎంటరవ్వడం ఖాయంగా అందరూ భావిస్తున్నారు.
మరోపక్క ఆయనకు దర్శకుడు పూరీజగన్నాథ్‌తో 'హార్ట్‌ఎటాక్' నుంచి మంచి అనుబంధం ఏర్పడింది. పూరీతో ఎవరైనా సంగీత దర్శకుడు కనెక్ట్ అయితే మాత్రం అదిరిపోతుందని గతంలోనే నిరూపితమైంది. స్వర్గీయ సంగీత దర్శకుడు చక్రి ఎంతగా పేరు తెచ్చుకున్నాడో అందరికీ తెలుసు. ఇప్పుడు పూరీ అనూప్‌రూబెన్స్‌తో బాగా కనెక్ట్ అయ్యాడనిపిస్తోంది. దీంతో ఆయన త్వరలో చేయనున్న బాలకృష్ణ చిత్రానికి సైతం అనూప్‌రూబెన్స్‌కే అవకాశం ఇచ్చినట్లు స్పష్టమవుతోంది. మరి అనూప్ అయినా దేవిశ్రీకి పోటీ ఇవ్వగలిగి, తమన్ స్థానాన్ని ఆక్రమిస్తాడో? వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటాడో లేదో కాలమే నిర్ణయించాలి.