మంచు విష్ణు - జి నాగేశ్వరెడ్డి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘ఆచారి అమెరికా యాత్ర’. అసలు ఈ సినిమా ఎప్పుడు మొదలైందో తెలియదు గాని తాజాగా ‘ఆచారి అమెరికా యాత్ర’ ఫస్ట్ లుక్ మాత్రం సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తుంది. ఈ చిత్రంలో మంచు విష్ణు బ్రాహ్మణుడిగా కనిపిస్తాడని ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తుంటే తెలుస్తుంది. విష్ణు తో బ్రహ్మనందం కూడా ఈ చిత్రంలో బ్రాహ్మణుడుగానే నటిస్తున్నాడు. ఆ పోస్టర్ లో విష్ణు, బ్రహ్మనందం బ్రాహ్మణ గెటప్ లో బైక్ మీద వెళుతూ స్టయిల్ గా కనిపిస్తున్నారు.
మంచు విష్ణుకి 'లక్కున్నోడు' చిత్రం గట్టి షాక్ ఇచ్చింది. ఇప్పుడు వస్తున్న ‘ఆచారి అమెరికా యాత్ర’ చిత్రంతో విష్ణు కి కంపల్సరీ హిట్ అవసరం. అందుకే కామెడీ చిత్రాల దర్శకుడు జి నాగేశ్వర రెడ్డితో జతకలిసి ఈ చిత్రాన్ని చేస్తున్నాడు. అలాగే బ్రహ్మనందం కి కూడా ఈ మధ్యన సరిగ్గా సినిమాలు లేక ఆయన ఇండస్ట్రీకి దూరమయ్యే పరిస్థితుల్లో ఉండడంతో ఈ చిత్రం హిట్ బ్రహ్మనందం కి కూడా చాలా ఇంపార్టెంట్. మరి ‘ఆచారి అమెరికా యాత్ర’ లో విష్ణు, బ్రహ్మి లుక్ చూస్తుంటే అదుర్స్ లో ఎన్టీఆర్, బ్రహ్మనందం బ్రాహ్మణ లుక్స్ లా కనబడుతున్నాయి. ఇక అదుర్స్ లో ఎన్టీఆర్, బ్రహ్మనందం మధ్యన బోలెడంత కామెడీ ఉంటుంది. అలాగే ఇప్పుడు ‘ఆచారి అమెరికా యాత్ర’ చిత్రంలో కూడా విష్ణు, బ్రహ్మి మధ్యలో అలాంటి కామెడీనే జి నాగేశ్వర రెడ్డి చూపించబోతున్నాడా? అనే అనుమానం కలుగుతుంది. సో.. కృష్ణమాచారి... అప్పలాచారి, అప్పులు.... తిప్పలు అంటూ ప్రేక్షకులని కడుపుబ్బా నవ్వించడానికి వచ్చేస్తున్నారన్నమాట.
అయితే ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేసే జి నాగేశ్వర రెడ్డి కి కూడా ‘ఆచారి అమెరికా యాత్ర’ చిత్ర హిట్ అనేది చాలా ఇంపార్టెంటు. ఆయన ఈ మధ్యన తీసిన చిత్రాలన్నీ వరుసగా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడడంతో మరి ఈ చిత్రమైనా హిట్ ఇస్తేనే ఆయన కెరీర్ సాఫీగా సాగుతుంది. లేకుంటే ఆయన్ని ఇండస్ట్రీ పక్కన పెట్టడానికి ఎంతో సమయం పట్టదు. మరి ఈ ఒక్క చిత్రం హిట్ కోసం మంచు విష్ణు, బ్రహ్మనందం, జి నాగేశ్వర రెడ్డి లు చాలా కష్టపడాలన్నమాట.