అఖిల్ ట్విట్- 'థాంక్యూ వదిన'..!

ఫస్ట్ సినిమా విడుదలకు ముందే అనేక ప్రాడక్ట్స్‌కు అఖిల్ బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఎన్నికై సంచలనం క్రియేట్‌ చేశాడు. మహేష్‌కు ఇప్పుడు ఉన్న బ్రాండ్‌ అంబాసిడర్‌ పోటీకి అఖిల్‌ చేరుకున్నాడని అప్పట్లో టాక్ కూడా వినిపించింది. ఇక మొదటి సినిమా తెలుగు ఇండస్ట్రీలోనే అతి పెద్ద డిజాస్టర్‌గా నిలిచినప్పటికీ అఖిల్‌కు ఉన్న ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ మాత్రం తగ్గలేదు. సోషల్‌ మీడియాలో ఆయన ఫాలోవర్స్‌ సంఖ్య తాజాగా ఒక మిలియన్‌ మార్కును చేరుకుని అందరినీ ఆశ్యర్యపరిచింది. ఈ సంద్భంగా అక్కినేని బుల్లోడు తన ఫాలోవర్స్‌కి థ్యాంక్స్‌ చెప్పాడు. మీరు నా ఫాలోవర్స్‌ కాదు.. నా బిలీవర్స్‌ అంటూ ఉద్వేగంతో ట్వీట్‌ చేశాడు. 

వెంటనే అఖిల్‌కు కాబోయే వదిన సమంత సైతం నీకు నేను బిలీవర్‌ని అని రిప్లై ఇవ్వడంతో అక్కినేని అభిమానులు ఆనందపడుతున్నారు. దానికి ప్రతిగా అఖిల్‌ కూడా 'థాంక్యూ వదిన' అని రిప్లై ఇవ్వడంతో ఈ ఆనందం రెండింతలైంది. ఇంకా చైతు-సామ్‌లపెళ్లి జరగలేదు. కేవలం నిశ్చితార్ధం మాత్రమే అయింది. అయినా కూడా అఖిల్‌ సామ్‌ను వదినా అని పిలిచి తన ఆప్యాయతను చాటుకున్నాడు. కాగా అఖిల్‌ రెండో చిత్రం ఏప్రిల్‌3న మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

akhil
samantha
akhil twit
akhil twitter followers
akhil akkineni