Advertisementt

'కాటమరాయుడు' ఫంక్షన్- గెస్ట్ ఎవరో తెలుసా?

Sat 18th Mar 2017 08:57 PM
katamarayudu,pawan kalyan,pre release function,guest  'కాటమరాయుడు' ఫంక్షన్- గెస్ట్ ఎవరో తెలుసా?
'కాటమరాయుడు' ఫంక్షన్- గెస్ట్ ఎవరో తెలుసా?
Advertisement
Ads by CJ

హైదరాబాద్ లో 'కాటమరాయుడు' సందడి మొదలైంది. ఈ రోజు శనివారం సాయంత్రం 'కాటమరాయుడు' ప్రీ రిలీజ్ ఫంక్షన్ ని హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో జరిపేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇక ఈ వేడుకకి లెక్కకుమించి పవన్ ఫ్యాన్స్ తో పాటు మెగా ఫ్యాన్స్ హాజరవుతారని అంచనా వేస్తున్నారు. ఇప్ప్పటి వరకు 'కాటమరాయుడు' కి సంభందించిన ఏ వేడుకని నిర్వహించలేదు గనక ఇప్పుడు ప్రీ రిలీజ్ ఫంక్షన్ ని గ్రాండ్ గా నిర్వహిస్తున్నారు. అందులోను పవన్ ఇండస్ట్రీలో అడుగుపెట్టి 20 సంవత్సరాలు పూర్తికావొస్తుండడంతో ఈ ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో ఆ 20  ఏళ్ళ ప్రస్థానం కు సంబందించిన వేడుకని పవన్ ఫ్యాన్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం అందుతోంది.

మరి కాటమరాయుడికి ఇంతపెద్ద ఫంక్షన్ ని ప్లాన్ చేసారు గనక గెస్ట్ లు కూడా భారీ సంఖ్యలో హాజరవుతారని చాలామంది భావిస్తున్నారు. అందులోను పవన్ మెగా హీరో కూడా. అందుకే మెగా ఫ్యామిలీ నుండి మెగా హీరోలెవరన్నా ఈ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి హాజరవుతారేమో అని.... ఈ హీరోల అట్రాక్షన్ వుంటే 'కాటమరాయుడి'కి ఇంకా హైప్ పెరుగుతుందని కూడా అనుకుంటున్నారట. అయితే ఈ ప్రీ రిలీజ్ వేడుకకి మాత్రం అటువంటి స్టార్స్ అట్రాక్షన్ ఏమి ఉండదట. కేవలం పవన్ కళ్యాణ్ మాత్రమే ఈ సినిమా వేడుకకి హీరో, గెస్ట్, మిగతా అన్ని అని అంటున్నారు. అయినా పవన్ కళ్యాణ్ వేడుకకి మరో గెస్ట్ అవసరమెందుకు పవన్ కి ఉన్న క్రేజ్ ముందు ఏ గెస్ట్ వచ్చిన పవన్ ముందు తేలిపోవడం ఖాయం. అందుకే చిత్ర నిర్మాత శరత్ మరార్ కూడా 'కాటమరాయుడు' ప్రీ రిలీజ్ వేడుకకి గెస్ట్ లను ఎవర్ని ఆహ్వానించలేదని తెలుస్తుంది. 

అసలు పవన్ ఫ్యాన్స్ కి పవన్ కనిపిస్తే చాలు మిగతా ఎవర్ని పట్టించుకునే తీరిక, ఆలోచన వారికుండదు. అయితే  పవన్ 20  ఏళ్ళ సినిమా ప్రస్థానం కి భారీ సన్మాన కార్యక్రమం కూడా ఉండడంతో ఎవరినైనా గెస్ట్ లను పిలిస్తే బావుండేదని.... పోనీ మెగాస్టార్ ని అయినా ఆహ్వానిస్తే సరిపోయేదనే అభిప్రాయాన్నికూడా వ్యక్తం చేస్తున్నారు కొందరు. ఏది ఎలాగున్నా కాటమరాయుడికి క్రేజ్ మాత్రం మాములుగా లేదు. కాటమరాయుడు బిజినెస్ చూసిన వారందరికీ ఆ విషయం తెలుస్తుంది. ఇక కాటమరాయుడు జోరు సెన్సార్ లోనే తెలిసిపోయింది. క్లిన్ 'యు' సర్టిఫికెట్ తో పర్ఫెక్ట్ చిత్రంగా ప్రేక్షకులని ఎంటర్టైన్ చెయ్యడానికి పవన్ కళ్యాణ్ - శృతి హాసన్ తో  ఈ నెల 24 న వచ్చేస్తున్నాడు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ