Advertisementt

ఇప్పుడందరి కళ్ళు దక్షిణాదిపైనే..!

Sat 18th Mar 2017 04:42 PM
bahubali,2.0,sanghamitra,randaamujam,south cinema industry  ఇప్పుడందరి కళ్ళు దక్షిణాదిపైనే..!
ఇప్పుడందరి కళ్ళు దక్షిణాదిపైనే..!
Advertisement
Ads by CJ

నిన్నటి వరకు ఇండియన్‌ సినిమా అంటే బాలీవుడ్‌ సినిమానే. వందేళ్లకు పైగా ఇదే సాగుతోంది. భారీ బడ్జెట్‌ చిత్రాలైనా, కమర్షియల్‌ చిత్రాలైనా, కంటెంట్‌ ఓరియంటెడ్‌, ప్రయోగాత్మక చిత్రాలదైనా వారి హవానే. అయితే గత కొంతకాలంగా పరిస్థితులు వేగంగా మారిపోతున్నాయి. 'రోబో, విశ్వరూపం, బాహుబలి' వంటి చిత్రాలతో ప్రపంచం దక్షిణాది చిత్రాల వైపు చూస్తోంది. ఇంతకాలం కేవలం బాలీవుడ్‌కే సొంతమైన 100కోట్లు, 200కోట్లను మన దక్షిణాది చిత్రాలు కూడా సాధిస్తున్నాయి. రజనీ, కమల్‌ల తర్వాత మాత్రమే మన తెలుగు చిత్రాలవైపు ఉత్తరాది వారు చూసేవారు. కానీ 'బాహుబలి1' దెబ్బతో తెలుగు చిత్రాల స్థాయి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపులోకి వచ్చింది. ఇంతకాలం రీమేక్‌ చేయడం కోసం హాలీవుడ్‌ చిత్రాల వైపు చూసే వారు కూడా ప్రస్తుతం తెలుగు, తమిళ, మలయాళ చిత్రాల వైపు చూస్తున్నారు. త్వరలో రానున్న నాలుగు ఆణిముత్యాలైన చిత్రాల ద్వారా ఈ ఖ్యాతి మరింత ఇనుమడించేలా ఉంది. దక్షిణాది చిత్రాలు సాధిస్తోన్న వసూళ్లను చూసి మల్టీనేషనల్‌, కార్పొరేట్‌ సంస్థలు కూడా మన చిత్రాలపై దృష్టి కేంద్రీకరిస్తున్నారు.

'బాహుబలి-ది బిగినింగ్‌'కు రెండో పార్ట్‌గా వస్తోన్న 'బాహుబలి-ది కన్‌క్లూజన్‌', శంకర్‌ దర్శకత్వం వహిస్తున్న '2.0' చిత్రాలు ఇప్పటికే సంచలనాలు సృష్టిస్తున్నాయి. 250కోట్ల బడ్జెట్‌తో రూపొందిన 'బాహుబలి- దికన్‌క్లూజన్‌' చిత్రం విడుదలకు ముందే 500కోట్లకు పైగా ప్రీరిలీజ్‌ బిజినెస్‌ చేసి, వెయ్యికోట్లకు పైగా వసూళ్లను టార్గెట్‌ చేసింది. ఇక '2.0'లో రజనీతోపాటు అక్షయ్‌కుమార్‌ కూడా నటిస్తుండటం, దాదాపు 400కోట్లతో ఈ చిత్రం ఇండియన్‌ చరిత్రలోనే హయ్యస్ట్‌ బడ్జెట్‌ మూవీగా రూపొందుండటంతో ఈ చిత్రం షూటింగ్‌ పూర్తికాకముందే జీటీవీ ద్వారా శాటిలైట్‌ హక్కులపైనే ఏకంగా బడ్జెట్‌లో మూడోవంతుని సాధించింది. ఇక మలయాళంలో ఇటీవలే 'పులిమురుగన్‌'తో 100కోట్లను దాటిన మోహన్‌లాల్‌ ప్రస్తుతం ఓ నవల ఆధారంగా 'రాండామూజం' చిత్రాన్ని '2.0' కంటే ఎక్కువ బడ్జెట్‌తో అంటే 600 కోట్ల బడ్జెట్‌తో రూపొందించనున్నాడు. మరోపక్క తమిళ దర్శకుడు సుందర్‌.సి 'సంఘమిత్ర' అనే చిత్రాన్ని విజయ్‌ హీరోగా 400కోట్లతో తెరకెక్కిస్తున్నాడు. దీంతో ఈ నాలుగు చిత్రాలపై ప్రస్తుతం అందరి కళ్లు పడ్డాయి. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ