Advertisementt

రాజమౌళి పై ప్రశంసల జల్లు ఆగడం లేదు!

Thu 16th Mar 2017 09:16 PM
rajamouli,kushboo,ntr,tarak,bahubali 2 trailer  రాజమౌళి పై ప్రశంసల జల్లు ఆగడం లేదు!
రాజమౌళి పై ప్రశంసల జల్లు ఆగడం లేదు!
Advertisement
Ads by CJ

దేశవ్యాప్తం గా ఎదురుచూస్తున్న 'బాహుబలి' ట్రైలర్ రానే వచ్చింది. 'బాహుబలి ద కంక్లూజన్' అంటూ వస్తున్న ఈ చిత్ర ట్రైలర్ ని రాజమౌళి అండ్ టీమ్ ఈ రోజు ఉదయమే విడుదల చేశారు.  ఒక్క ట్రైలర్ తోనే సినిమా చూశామా.. అనే ఫీల్ తెప్పించిన రాజమౌళికి టాలీవుడ్ హీరోల నుండి ప్రశంసల జల్లు మొదలైంది. ఈ ట్రైలర్  చూసిన టాలీవుడ్ ప్రముఖులు రాజమౌళి టాలెంట్ ని తెగ పొగిడేస్తున్నారు. 'బాహుబలి 2' ట్రైలర్ తో సంచలనాలకు తెర తీసిన రాజమౌళి మీద పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. తమ తమ అభిప్రాయాలని సోషల్ మీడియా ద్వారా రాజమౌళికి చేర వేస్తున్నారు వారు. ఇప్పటికే టాలీవుడ్ టాప్ డైరెక్టర్ గా కొనసాగుతున్న రాజమౌళి 'బాహబలి' విడుదల తర్వాత ఎక్కడికో వెళ్లిపోవడం ఖాయమని ఈ ట్రయిలర్ చూసిన ప్రతి ఒక్కరు చెబుతున్న మాట.

ముందుగా రాజమౌళిని అభినందనలతో ముంచెత్తాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. 'బాహుబలి' ట్రైలర్ ని చూసిన ఎన్టీఆర్....  'ఇలాంటి అనుభూతిని వేరే దేనితో పోల్చడానికి సరిపోదు. మీ పల్స్ పరిగెడుతుంది.. మీ ఊపిరి ఆగిపోతుంది. కళ్లప్పగించి మరీ అలా చూస్తూనే ఉంటారు.... శభాష్ జక్కన్న' అంటూ ట్వీట్ చేసి అందరిని ఆకట్టుకున్నాడు. ఎప్పుడూ సోషల్ మీడియా ని పెద్దగా వాడని ఎన్టీఆర్ ఇలా 'బాహుబలి' ట్రైలర్ పై స్పందించడం కొంచెం ఆశ్చర్యం కలిగించింది. మరో హీరో రామ్ పోతినేని కూడా 'బాహుబలి' ట్రైలర్ గురించి ట్విట్టర్ లో స్పందించాడు. రామ్ 'బాహుబలి ద కంక్లూజన్' సినిమాని ది ప్రైడ్ తెలుగు సినిమాగా అభివర్ణించాడు. అలాగే ది ప్రైడ్  తెలుగు సినిమా... సారీ ది ప్రైడ్ ఆఫ్ సౌత్ సినిమా మళ్ళీ సారి ది ప్రైడ్ ఆఫ్ ఇండియా సినిమా అంటూ ట్వీట్ చేసిన రామ్.. రాజమౌళిని పొగడ్తలతో ముంచెత్తాడు. సాయి ధరమ్ తేజ్, అల్లు శిరీష్, కుష్బూ, శేఖర్ కపూర్ మొదలగు వారంతా ఈ ట్రైలర్ పై, రాజమౌళి పై ప్రశంసల జల్లు కురిపించారు. 

మరి ఇలా హీరోల ట్వీట్స్ చూస్తుంటే రాజమౌళి 'బాహుబలి' సినిమాతో ఎంతటి కీర్తి ప్రతిష్టలను మూటగట్టుకుంటున్నాడో అర్ధమవుతూనే వుంది. ఇక ఒక్క ట్రైలర్ రిలీజ్ కే పరిస్థితి ఇలా ఉంటే సినిమా విడుదల తర్వాత ఇంకెలా ఉంటుందో ఊహకే అందడం లేదు కదూ...!

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ