Advertisement

ఈ చీకటి వ్యవహారాలు ఆపేదెవరు..?

Thu 16th Mar 2017 08:09 PM
tammareddy bharadwaja,suchi leaks,police,politics,cinema  ఈ చీకటి వ్యవహారాలు ఆపేదెవరు..?
ఈ చీకటి వ్యవహారాలు ఆపేదెవరు..?
Advertisement

ఈ సమాజంలో అన్నింటికన్నా సులువైనది ఎదుటివారికి నీతులు చెప్పడం మాత్రమే. ఇది అక్షరసత్యం. మేథావుల నుంచి సామాన్యుల వరకు, పత్రికల నుంచి చానెల్స్‌ వరకు అందరూ నీతులు చెప్పేవారే. సుచిలీక్స్‌తో పాటు ఎన్నో చీకటికోణాలు సినీ పరిశ్రమలో బయటకు వస్తున్నా కూడా ఎవ్వరూ స్పందించడం లేదు. కారణం.. ఇవ్వన్నీ ఇండస్ట్రీలో కామనే అనా? లేక వాటిని ఖండిస్తే తాము ఎప్పుడెప్పుడో అలా చేసిన వారిమే కాబట్టి అవి మన మెడకు కూడా చుట్టుకుంటాయనే భయమా? అనేది ఎవ్వరికీ అర్ధం కావడం లేదు. పెద్దల వ్యవహారం కాబట్టి పోలీసులు కూడా మౌనమంత్రాన్ని జపిస్తూ తమ వద్దకు ఫిర్యాదు వస్తేనే చర్యలు తీసుకోవాలని మిన్నకుండిపోతున్నారు. దీనిపై తమ్మారెడ్డి మాట్లాడుతూ, ఈ విషయం జరిగి 10రోజులు కావస్తున్నా పోలీసులు ఎందుకు మౌనంగా ఉన్నారు? ఎవరో కంప్లైంట్‌ చేస్తే గానీ చర్యలు తీసుకోరా? అని ప్రశ్నించాడు. సినిమా పరిశ్రమలో దాసరి, తమ్మారెడ్డిలే పెద్ద దిక్కుగా ఉంటారు. మరి ఈ విషయంలో వారే ముందుకొచ్చి ఎందుకు ఫిర్యాదు చేయడం లేదు? మీకే అంత భయం ఉంటే ఇక సాధారణ ప్రజలకు ఎంత భయం ఉంటుంది? అనేది ఆలోచించగలగాలి. ఇక ఇప్పటికే సినిమా వారంటే జనాలలో మంచి అభిప్రాయం ఉందని, సుచీలీక్స్‌ తర్వాత ఈ ఆభిప్రాయం మరింత బలపడుతోందని తమ్మారెడ్డి వ్యంగ్యంగా చేసిన వ్యాఖ్యల వెనుక ఎంతో ఆవేదన ఉంది. 

ఇక అవి నిజమే అయితే వాటిని తీస్తున్న శాడిస్టులు ఎవరో వెతికిపట్టుకోవాలని తమ్మారెడ్డి చెప్పడం మాత్రం విడ్దూరం. సినిమా రంగం, సినీఫీల్డ్‌ అనేవి రాజకీయ రంగం కాదు. రాజకీయాలలో ప్రజా ప్రతినిధులు, నాయకులు ప్రజల చేత, ప్రజల మధ్యలో ఉంటారు. కాబట్టి వారి వ్యక్తిగత జీవితంలో తప్పు జరిగినా కూడా మీడియా భయం లేకుండా వాటిని రచ్చకీడుస్తుంది. వారి వ్యక్తిగత విషయాలను కూడా బయటపెట్టి వారిని ప్రజల తరపున నిలదీస్తుంది. కానీ సినిమా అనేది ఎవరి జేబులో నుంచి వారు పెట్టే పెట్టుబడి. ఇది వ్యక్తిగత వ్యవహారం. ఫలానా సినిమా వల్ల నీకు కోట్లు నష్టాలొచ్చాయి? కదా అని ప్రశ్నిస్తే.. అది నా డబ్బు. ప్రజల డబ్బు కాదు. ఇది మా వ్యక్తిగత వ్యవహారం అని తేల్చేస్తారు. కాబట్టి సినీ మీడియాకు పెద్దగా పవర్స్‌లేవు. ఇవే సుచీలీక్స్‌ నిజజీవితంలో ఓ రాజకీయ నాయకుడి విషయంలో జరిగి ఉంటే దేశాధ్యక్షులు, ప్రధానులే రాజీనామా చేయాల్సినంత పెద్ద విషయమయ్యేది. కానీ ఇది సినీ వ్యవహారం కావడంతో మీడియా కూడా ఏమీ చేయలేకపోతోంది. ఇక లైట్‌బోయ్‌ నుంచి ఈ విషయాలు అందరికీ తెలిసినా పొట్ట కూటి కోసం మౌనంగా ఉండకతప్పనిస్థితి. 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement