జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాటమరాయుడు చిత్రం తాలూకూ ఫ్రీరిలీజ్ ఫంక్షన్ ను చిత్రయూనిట్ చేయాలనుకుంటున్న విషయం తెలిసిందే. సహజంగా పవన్ కళ్యాణ్ కు ఆడియో ఫంక్షన్లు, ప్రీ రిలీజింగ్ ఫంక్షన్‌లు వంటివి చేయడం అస్సలు ఇష్టం ఉండదన్న విషయం తెలిసిందే. అందుకే ఆయన హీరోగా చేసిన ఏ సినిమాలైనా అలా ఒకేసారి విడుదలై సంచలనాత్మకంగా బాక్సాఫీసును బద్ధలు చేస్తుంటాయి. కానీ ఈ మధ్యనే పవన్ ప్రచారంపైన కూడా కాస్త దృష్టి పెట్టినట్లు తెలుస్తుంది. అందుకు కారణం లేకపోలేదు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ క్రియేటీవ్ వర్క్స్ అంటూ నిర్మాణ భాగస్వామ్యం కూడా తీసుకున్న విషయం తెలిసిందే. అందుకోసమే ప్రమోషన్లు చేసుకోక తప్పడం లేదు.
అయితే తాజాగా పవన్ చిత్రమైన కాటమరాయుడు ప్రీ రిలీజ్ ఫంక్షన్ అని ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది చిత్రబృందం. అయితే ఈ కార్యక్రమాన్ని ఈనెల 18వ తేదీన హైదరాబాద్‌లో నిర్వహించబోతున్నారు. ఆ వేడుక కూడా ఖాయమైపోయింది. కాటమరాయుడు ఫ్రీరిలీజ్ ఫంక్షన్ కోసం శిల్పకళావేదికని ఖాయం చేశారు చిత్రబృందం. అసలు విషయం ఏంటంటే.. కాటమరాయుడు ఫ్రీరిలీజ్ వేడుకను శిల్పకళా వేదికలోనే ఎందుకు చేస్తున్నారంటే.. ఈ వేడుకకు ఓ ప్రత్యేకత ఉంది అంటున్నారు చిత్రబృందం. అదేంటంటే... పవన్ కల్యాణ్ సినీ పరిశ్రమకు వచ్చి 20 యేళ్లు అయిన విషయం తెలిసిందే. ఈ వేడుకను కాటమరాయుడు ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో గ్రాండ్‌గా చేయాలని నిర్ణయించుకున్నారట చిత్రబృందం.
సహజంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తొలి చిత్రం ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’. ఈ చిత్రం విడుదలై పోయిన సంవత్సరం అక్టోబర్ కి 20 యేళ్లు అయ్యింది. అయితే ఆ అక్టోబర్ నుండి ఇప్పటివరకు కూడా పవన్ కు సంబంధించి ఎటువంటి వేడుక జరపలేదు. అందుకోసం ప్రత్యేకంగా కాటమరాయుడు ఫ్రీరిలీజ్ ఫంక్షన్ లోనే పనిలో పనిగా ఈ వేడుకను కూడా జరపాలని చిత్రబృందం తీర్మానించుకున్నారు. సహజంగా శరత్ మరార్ ఈ వేడుకను ప్రత్యేకంగా చేయాలని భావించాడట. కానీ పవన్ అందుకు అంగీకరించక ఈ ఫంక్షన్ లోనే చాలా సింపుల్ గా దీన్ని కూడా కలిపి చేసుకోండి అంటూ సూచించాడంట. అందుకు రెండు వేడుకల్ని ఒకేదాంట్లో చేయడానికి ఫిక్స్ అయిందంట చిత్రబృందం. ఇదన్న మాట కాటమరాయుడు ఫ్రీరిలీజ్ ఫంక్షన్ లో పవన్ ప్రత్యేక కార్యక్రమం.