Advertisementt

ఈ హీరో.. సాహసమే శ్వాసగా సాగిపోతున్నాడు..!

Thu 16th Mar 2017 01:23 PM
sharwanand,radha,katamarayudu,big fight  ఈ హీరో.. సాహసమే శ్వాసగా సాగిపోతున్నాడు..!
ఈ హీరో.. సాహసమే శ్వాసగా సాగిపోతున్నాడు..!
Advertisement
Ads by CJ

'సాహసం శ్వాసగా సాగిపో' అనే టైటిల్‌తో నాగచైతన్య.. గౌతమ్‌ మీనన్‌ దర్శకత్వంలో ఓ చిత్రం చేశాడు. కానీ సినీ జీవితంలో, నిజ జీవితంలో ఈ టైటిల్‌ యంగ్‌హీరో శర్వానంద్‌కు బాగా సూటవుతుందని చెప్పవచ్చు. స్టార్స్‌ మధ్యలో ఈ యంగ్‌హీరో పోటీ పడటం, ఢీ ఆంటే ఢీ అనడం శర్వానంద్‌కు మామూలైపోయింది. బడా సినిమాల మధ్యలో వస్తే కొన్ని ఇబ్బందులతో పాటు కొన్ని ప్లస్‌ పాయింట్స్‌ కూడా ఉంటాయి. స్టార్స్‌ చిత్రాలకు పెద్దగా టాక్‌ రాకపోయినా, లేదా పెద్ద చిత్రాల టిక్కెట్లు దొరకని వారికి ఫలానా యంగ్‌ హీరో చిత్రం బాగుందని తెలిస్తే దానిని కూడా చూస్తారు. గతంలో చిరు చిత్రాలతో పోటీపడి శేఖర్‌కమ్ముల కొన్ని సినిమాల విషయంలో దానిని నిరూపించాడు. ఇక పెద్ద చిత్రాలతో పోటీ పడితే థియేటర్ల సమస్య నుంచి ఓపెనింగ్స్‌ విషయం వరకు కొన్ని మైనస్‌లు కూడా ఉంటాయి. కానీ శర్వా చేస్తున్న చిత్రాలన్నీ పెద్ద నిర్మాతలతోనే కావడంతో ఆయనకు థియేటర్ల సమస్య పెద్దగా ప్రభావం చూపించడం లేదు. తన చిత్రాలను పెద్ద చిత్రాలతో, స్టార్స్‌ చిత్రాల మధ్యలో దింపి సైలైంట్‌ కిల్లర్‌గా మారిపోతున్నాడు. 2016లో ఆయన ఎన్టీఆర్‌ 'నాన్నకు ప్రేమతో' , బాలకృష్ణ 'డిక్టేటర్‌', నాగార్జున 'సోగ్గాడే చిన్నినాయన'ల మధ్య యువి క్రియేషన్స్‌ అండతో వచ్చి 'ఎక్స్‌ప్రెస్‌రాజా'గా షాకిచ్చాడు. 

ఇక ఈ ఏడాది చిరు 'ఖైదీ నెంబర్‌ 150 ', బాలకృష్ణ 'గౌతమీ పుత్ర శాతకర్ణి'లని ఢీ కొట్టి దిల్‌రాజు అండతో 'శతమానం భవతి'అని రెచ్చిపోయాడు. బయ్యర్లకు పెట్టుబడికి మూడు నాలుగింతలు లాభాలు తెచ్చిపెట్టాడు. నిఖార్సైన హిట్‌ను సాధించాడు. కాగా ప్రస్తుతం వరుసగా నాలుగు హిట్స్‌ కొట్టిన శర్వా త్వరలో 'రాధ' అనే చిత్రంతో ఫన్నీ పోలీస్‌గా రానున్నాడు. ఈ చిత్రానికి దర్శకుడు చంద్రమోహన్‌ అనే వ్యక్తి కొత్త డైరెక్టర్‌ అయినప్పటికీ, దీనికి నిర్మాత మాత్రం బడా బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ కావడం విశేషం. ఈ చిత్రాన్ని ఈనెల 29న ఉగాది కానుకగా విడుదల చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాగా ఈ చిత్రం విడుదలకు వారం ముందుగా అంటే 24వతేదీన పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌ నటిస్తున్న 'కాటమరాయుడు' విడుదల కానుంది. ఇక వారం తర్వాత అంటే ఏప్రిల్‌7న వెంకటేష్‌ 'గురు'గా రానున్నాడు. మరి ఈసారి శర్వా ఈ పోటీలో కూడా నెగ్గి వరుసగా ఐదో హిట్‌ కొడతాడో లేదో వేచిచూడాల్సివుంది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ