Advertisementt

ఈసారి 'బాహుబలి' కి పోటీ తప్పదు..!

Wed 15th Mar 2017 09:45 PM
bahubali,srimanthudu,dj,duvvada jagannadham,kesava  ఈసారి 'బాహుబలి' కి పోటీ తప్పదు..!
ఈసారి 'బాహుబలి' కి పోటీ తప్పదు..!
Advertisement
Ads by CJ

'బాహుబలి- ది బిగినింగ్‌' చిత్రం అంత పెద్ద విజయం సాధించి, 500కోట్లకు పైగా కొల్లగొట్టడానికి అద్భుతమైన విజువల్‌ వండర్‌ కావడం, సినిమాలో దమ్ముండటమే కాదు.. ఇతర అనేక విషయాలు కూడా పనిచేశాయి. స్వయాన మహేష్‌బాబు వంటి సూపర్‌స్టారే తన'శ్రీమంతుడు' చిత్రాన్ని బాహుబలికి సైడిచ్చాడు. ఒక నెల రోజుల దాకా 'బాహుబలి 1'కి ఎవ్వరూ పోటీ రాలేదు. ఇదే అదృష్టం మిగిలిన భాషల్లో కూడా జక్కన్నకు కలిసొచ్చింది. కానీ 'బాహుబలి-ది కన్‌క్లూజన్‌'కి మాత్రం పోటీ తప్పేలా లేదు. రెండు మూడు తెలుగు చిత్రాలు, తమిళ చిత్రాలు, హిందీ చిత్రాలు కూడా 'బాహుబలి- 2'కి పోటీ ఇవ్వడానికి రెడీ అవుతున్నాయి. ఇక తెలుగు విషయానికి వస్తే రెండు చిత్రాలు ఆ చిత్రానికి సైలెంట్‌ కిల్లర్స్‌గా రానున్నాయి. వరుస వైవిధ్యభరితమైన చిత్రాలు, కథలతో ఆకట్టుకుంటూ చాపకింద నీరులా దూసుకుపోతున్న నిఖిల్‌-సుధీర్‌వర్మల 'కేశవ' చిత్రం మే 12న అంటే బాహుబలి-2 విడుదలైన రెండు వారాలకే థియేటర్లలోకి రానుంది. ఇక వరుస విజయాలతో దూసుకెళ్తున్న బన్నీ-దిల్‌రాజు-హరీష్‌శంకర్‌ల 'డిజె' (దువ్వాడ జగన్నాథం) మే 19న రిలీజ్‌ కానుంది. ఏమాత్రం బాహుబలి-2 విషయంలో చిన్న తేడా వచ్చినా కూడా దానిని క్యాష్‌ చేసుకోవాలని చాలామంది రెడీ అవుతుండటం జక్కన్నకు వార్నింగ్‌ బెల్స్‌గా కొందరు అభివర్ణిస్తున్నారు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ