చాలా తక్కువ టైమ్ లోనే సమంత టాలీవుడ్ లో టాప్ పొజిషన్ కి చేరుకుంది. అందరి స్టార్ హీరోలపక్కన నటించిన సమంత ఇప్పుడు రామ్ చరణ్ పక్కన సుకుమార్ డైరెక్షన్లో హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే నాగ చైతన్యతో ప్రేమలో పడి వ్యవహారం పెళ్లివరకు వచ్చింది. ఇప్పటికే ఎంగేజ్మెంట్ చేసుకుని పెళ్లి పీటలెక్కడానికి తయారుగా వుంది. పెళ్లి కూతురుగా ముస్తాబవుతున్నా కూడా ఎడా పెడా సినిమాలు ఒప్పుకుంటూ కెరీర్లో కూడా దూసుకుపోతుంది. అయితే ఒకే ఒక్క రామ్ చరణ్ సినిమాలో మాత్రమే హీరోయిన్ గా చేస్తూ మిగతా చిత్రాలలో కేవలం స్పెషల్ రోల్స్ కే పరిమితమైంది. అయితే ఆ రోల్స్ ని సమంత కావాలనే ఒప్పుకుంటుందని... హీరోయిన్ గా కంటే పెళ్లైయ్యాక అలాంటి స్పెషల్ రోల్స్ అయితే బావుంటుందని ఉద్దేశ్యంతో సమంత ఇలా చేస్తుందనే టాక్ నడుస్తుంది.
ఇప్పటికే 'మహానటి' చిత్రంలో ఒక ముఖ్య పాత్రకి ఎంపికైన సమంత, నాగార్జున నటిస్తున్న 'రాజుగారి గది 2' లో కూడా ఒక స్పెషల్ రోల్ లో చేస్తుంది. మరి అక్కినేని వారింటి పరువు నిలబెట్టాలంటే ఇలా స్పెషల్ రోల్స్ తోనే సరిపెట్టుకుని హీరోయిన్స్ రోల్స్ కి దూరమవ్వాలనే ఆలోచనతోనే ఇప్పుడు మరో మూవీలో కూడా ఒక గెస్ట్ రోల్ ఒప్పుకుందనే వార్తలొస్తున్నాయి. యంగ్ హీరో నాగ సౌర్య కొత్త చిత్రం ‘అమ్మమ్మగారి ఇల్లు’ టైటిల్ తో తెరకెక్కబోయే ఈ మూవీలో సమంత స్పెషల్ రోల్ చేస్తోందనే టాక్ రావడంతో నిజంగానే సమంత ఇక హీరోయిన్‌గా చేయదా? అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. అంటే సమంత ఈ అనుమానాలకు చెక్ పెట్టాలంటే ఏదన్న మరో మూవీ లో హీరోయిన్ గా చెయ్యాల్సిందే... లేకపోతె ఈ గాసిప్స్ కి ఆనకట్ట వెయ్యడం వీలయ్యేపని కాదు.