Advertisementt

క్రిష్ నెక్స్ట్ చోరుడా..!

Wed 15th Mar 2017 01:28 PM
rayabari,chora,venkatesh,chiranjeevi,director krish,gautamiputra satakarni  క్రిష్ నెక్స్ట్ చోరుడా..!
క్రిష్ నెక్స్ట్ చోరుడా..!
Advertisement
Ads by CJ

తన మొదటి సినిమా నుండి ఎంతో ప్రత్యేకమైన సినిమా కథలనే ఎంచుకుని తెరకెక్కించే క్రిష్ ఈ ఏడాది బాలకృష్ణ కి 100 వ చిత్రం 'గౌతమీపుత్ర శాతకర్ణి' ని తీసి హిట్ కొట్టాడు. బాలకృష్ణ ని ఎలా చూపిస్తే ప్రేక్షకులకి అభిమానులకు నచ్చుతుందో అలాగే తెర మీద బాలయ్యని ప్రెజంట్ చేసి మంచి మార్కులు కొట్టేసిన క్రిష్ తన తదుపరి ప్రాజెక్ట్ ని వెంకటేష్ తో చేయబోతున్నట్లు వార్తలొచ్చాయి. కానీ వెంకటేష్ తో చేసే సినిమాని ఒక నవల ఆధారంగా తెరకెక్కించాలని క్రిష్ భావించాడు. ఇక ఆ నవల రైట్స్ కొనడానికి క్రిష్ సిద్దమవగా ఆ రైట్స్ ని వేరొకరు చేజిక్కించుకోవడంతో వెంకటేష్ తో ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది.

అసలు క్రిష్, బాలకృష్ణ తో 'గౌతమిపుత్ర....'ని తెరకెక్కించడానికి ముందే రామ్ చరణ్ తో 'రాయబారి' చిత్రాన్ని ప్లాన్ చేసాడు.. కానీ అది ఎందుకో వర్కౌట్ కాలేదు. ఇక అప్పుడు ఆ చిత్రాన్ని పక్కన పెట్టేసి బాలయ్యతో చారిత్రాత్మక కథని తీసాడు. ఇక ఇప్పుడు వెంకటేష్ తో అనుకున్న ప్రాజెక్ట్ కూడా ఆగిపోవడంతో ఇప్పుడు క్రిష్ నందమూరి హీరో కళ్యాణ్ రామ్ కి ఒక కథని సిద్ధం చేసినట్లు వార్తలొస్తున్నాయి. ఇప్పటికే ఒక కథని కళ్యాణ్ రామ్ కి వినిపించాడని... ఇంకా కళ్యాణ్ రామ్ ఓకె చెయ్యలేదని టాక్. అయితే క్రిష్ మాత్రం 'చోర' అనే టైటిల్ ని రిజిస్టర్ చేయించినట్లు ప్రచారం మొదలైంది.

మరోపక్క క్రిష్, చిరంజీవికి కూడా ఒక కథ ని సిద్ధం చేసినట్లు ఇప్పటికే ఆ కథ విషయమై చర్చలు జరిపినట్లు చెబుతున్నారు. ఎలాగైనా చిరు ని డైరెక్ట్ చెయ్యాలని క్రిష్ ట్రై చేస్తున్నట్లు కూడా ప్రచారం జరుగుతుంది. మరి ఆ 'చోర' టైటిల్ తో చిరంజీవిని డైరెక్ట్ చేస్తాడా? లేకపోతే కళ్యాణ్ రామ్ ని డైరెక్ట్ చేస్తాడా? అనేది తెలియాల్సి వుంది. ఎవరితో సినిమాని చేస్తాడనే దాని మీద క్లారిటీ లేకపోయినా... 'చోర' టైటిల్ తో మాత్రం ఒక చిత్రం త్వరలోనే సెట్స్ మీదకెళ్ళబోతున్నట్లు సమాచారం.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ