Advertisementt

నటి జయసుధ భర్త..ఆత్మహత్య!

Wed 15th Mar 2017 10:36 AM
jayasudha husband,nitin kapoor suicide,mumbai,jitendra,jayasudha,suicide  నటి జయసుధ భర్త..ఆత్మహత్య!
నటి జయసుధ భర్త..ఆత్మహత్య!
Advertisement
Ads by CJ

ప్రముఖ నటి జయసుధ భర్త, నిర్మాత అయిన నితిన్ కపూర్ ఈ రోజు మధ్యాన్నం 2  గంటల సమయంలో ముంబైలో ఆత్మహత్య కి పాల్పడ్డారు. నితిన్ కపూర్ బాలీవుడ్ హీరో జితేంద్ర కు స్వయానా సోదరుడు. ఆయనకి 58  ఏళ్ళు మాత్రమే. నటి జయసుధని 1985 లో వివాహమాడారు.  జయసుధ - నితిన్ కపూర్ దంపతులకి ఇద్దరు కుమారులు.. నిహార్ , శ్రేయాస్ లు. అందులో ఒక కొడుకు శ్రేయాస్ 'బస్తి' సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీ కి పరిచయమయ్యాడు. నితిన్ కపూర్ కూడా పలు సినిమాలకు నిర్మాతగా పని చేశారు. కలికాలం, హ్యాండ్సెమ్, వింతమొగుడు వంటి పలు సినిమాలను నిర్మించారు. అయితే ఎప్పుడూ జయసుధతో అన్ని ఫంక్షన్స్ కి హాజరయ్యి, ఆవిడకి చేదోడు వాదోడుగా వుండే నితిన్ కపూర్ ఇలా ఆత్మహత్య చేసుకోవడం అందరిని షాక్ కి గురి చేసింది. అసలు ఆయనకి  ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందో కారణాలు తెలియాల్సి వుంది.  నితిన్ కపూర్ ఆత్మహత్యకి పాల్పడినప్పుడు  జయసుధ హైదరాబాద్ లో వున్నారు. విషయం తెలియగానే ఆమె ముంబై కి బయలుదేరి వెళ్లారు. పూర్తి వివరాలు తెలియాల్సి వుంది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ