Advertisementt

ఇద్దరు ఫేడవుట్‌ వ్యక్తుల ప్రయోగం..!

Tue 14th Mar 2017 08:22 PM
amma rajasekhar,jd chakravarthy,shiva,jd chakravarthy movies  ఇద్దరు ఫేడవుట్‌ వ్యక్తుల ప్రయోగం..!
ఇద్దరు ఫేడవుట్‌ వ్యక్తుల ప్రయోగం..!
Advertisement
Ads by CJ

'శివ' చిత్రంలో జెడిగా ఓ పాత్రను చేసి దానినే ఇంటి పేరుగా మార్చుకున్న నటుడు చక్రవర్తి. ఆయనకు గడ్డం చక్రవర్తి, చక్రి, జెడి ఇలా పలు నామధేయాలున్నాయి. వర్మ కాంపౌండ్‌ వ్యక్తి కావడంతో ఈయన కూడా బహుముఖ ప్రజ్ఞాశాలి. నటునిగా, నిర్మాతగా, దర్శకునిగా, సంగీత దర్శకునిగా ఎన్నో ప్రయత్నాలు చేశాడు. ఇక ఈయనకు దేశవాప్తంగా 'సత్య' సినిమాతో మంచి గుర్తింపు వచ్చింది. కానీ దానిని ఆయన నిలబెట్టుకోలేకపోయాడు. 'గులాబి, అనగనగా ఓరోజు, ప్రేమకు వేళాయెరా, కాశీ, మనీ, మనీ మనీ..' వంటి పలు చిత్రాలతో యూత్‌లో మంచిగుర్తింపు తెచ్చుకుని ప్రస్తుతం విలన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా, సపోర్టింగ్‌ రోల్స్‌ చేస్తున్నాడు. ఇక ఆయన నాగచైతన్య నటించిన మొదటి చిత్రం 'జోష్‌', శ్రీనువైట్ల-రవితేజల 'దుబాయ్‌ శ్రీను'తో పాటు తాజాగా మంచు విష్ణు హీరోగా నటించిన 'డైనమైట్‌' చిత్రాలలో కూడా నటించాడు. ఇక ఆయన డ్యాన్స్‌ మాస్టర్‌ అమ్మరాజశేఖర్‌ను టాలీవుడ్‌కి పరిచయం చేశాడు. ఇక కొరియోగ్రాఫర్‌ నుంచి అమ్మరాజశేఖర్‌ కూడా దర్శకునిగా మారి 'రణం, ఖతర్నాక్‌' వంటి చిత్రాలు తీశాడు. ఆ తర్వాత తానే నటునిగా, తన సోదరుడు హీరోగా కూడా చిత్రాలు తీసి చేతులు కాల్చుకున్నాడు. ఇలా ఫేడవుట్‌ అయిన ఇద్దరు గురుశిష్యులు కలిసి త్వరలో ఓ చిత్రాన్ని చేయనున్నారు. ఈ చిత్రంలో జెడి మరలా ఫుల్‌ఫ్లెడ్జ్‌ హీరోగా కనిపించనున్నాడట. ఏ నిర్మాత కూడా ముందుకు రాని పక్షంలో ఈ ఇద్దరు కలిసే దీనిని నిర్మించే యోచనలో ఉన్నారని సమాచారం. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ