'సర్దార్‌గబ్బర్‌సింగ్' వంటి డిజాస్టర్ తర్వాత అందునా ఓ తమిళ 'వీరం' కథ ఆధారంతో రూపొందుతున్న చిత్రం 'కాటమరాయుడు'. ఇక ఈ చిత్ర దర్శకుడైన డాలీ ఏమీ స్టార్ డైరెక్టర్ కాదు. ఇక అనూప్‌రూబెన్స్ కూడా పేరు ప్రఖ్యాతులు గడించిన సంగీత దర్శకుడు కాదు. ఇక మిగిలిన తారాగణం కూడా అలాంటిదే. కేవలం పవన్‌కళ్యాణ్, శృతిహాసన్‌లకు మాత్రమే క్రేజ్‌ఉంది. ఇక హీరోయిన్ కాబట్టి శృతిహాసన్ పరిధి పరిమితం. కానీ వీటన్నింటినీ కాదని 'కాటమరాయుడు' టీజర్, లిరికల్ సాంగ్స్‌కు ఇప్పుడు అదిరిపోయే రెస్పాన్స్ లభిస్తూ, సోషల్ మీడియాలో కొత్త కొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది. కాగా ఈ చిత్రాన్ని 15వ తేదీన సెన్సార్ జరిపేందుకు రెడీ అవుతున్నారని సమాచారం. ఇక ఈ చిత్రం ప్రీరిలీజ్ ఫంక్షన్‌ను గ్రాండ్‌గా జరపనున్నారు. మరోపక్క ఈ చిత్రాన్ని ఈనెల 29న ఉగాది కానుకగా విడుదల చేస్తారా? లేక ఓ వారం ముందుగా అంటే 24నే రిలీజ్ చేస్తారా? అనే విషయంపై క్లారిటీ రావడం లేదు. మరోపక్క పవన్ 'కాటమరాయుడు' రిలీజైన వెంటనే త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో చేయబోయే చిత్రం షూటింగ్‌లో జాయిన్ అవుతాడు. ప్రస్తుతం త్రివిక్రమ్ రామోజీ ఫిల్మ్‌సిటీలో ఓ సెట్‌ను వేయిస్తున్నాడు. కాగా ఇందులో పవన్ ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అని తెలుస్తోంది. 'జల్సా'లో యువకునిగా, నక్సలైట్‌గా, 'అత్తారింటికి దారేది' చిత్రంలో ధనవంతునిగా, ఓ డ్రైవర్‌గా చూపించిన త్రివిక్రమ్ తాజా చిత్రంలో పవన్‌ని టెక్కీగా చూపించనున్నాడని వార్తలు వస్తూ ఉండటంతో ఆయన అభిమానులు ఆనందంలో తేలియాడుతున్నారు. ఇక ఇందులో కీర్తిసురేష్, అను ఇమ్మాన్యుయేల్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. అనిరుధ్ ఈ చిత్రం ద్వారా తెలుగులోకి ఎంట్రీ ఇస్తుండగా, హారిక అండ్ హాసిని బేనర్‌లో రాధాకృష్ణ ఈ చిత్రం నిర్మించనున్నాడు.