రాజకీయాలు అంతే.. చూట్టానికి చాలా విచిత్రంగా ఉంటాయ్. రాజకీయాలు అంటేనే ఎంతటి శత్రువులైనా క్షణంలో మిత్రులైపోతుంటారు. తాజాగా నంధ్యాలలోని భూమా నాగిరెడ్డి మరణంతో అక్కడ రాజకీయ శూన్యం ఏర్పడిన విషయం తెలిసిందే. అంతే కాకండా రకరకాల పుకార్లు కూడా వినిపించిన విషయం కూడా విదితమే. వైకాపా నుండి తెదేపాలోకి వెళ్ళిన భూమా కుటుంబానికి మంత్రివర్గంలో చోటు దక్కకపోవడంతో భూమా మానసికంగా కుంగిపోవడం గుండెపోటుకు దారితీసిందన్న వార్త ఆంధ్రరాష్ట్రంలో దావానలంలా వ్యాపించింది. అయితే ఈ విషయాన్ని తెదేపా పెరిగి పెద్దది చేసుకోకుండా భూమా నాగిరెడ్డికి వారసురాలుగా అఖిలప్రియను ప్రకటించి ఆమెను మంత్రివర్గంలోకి తీసుకొనేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు తెదేపా వర్గం నాయకులు. అందుకనే భామానాగిరెడ్డి మరణంపై విచారిస్తూనే... మరోపక్క దానిపై పడే రాజకీయ ప్రభావంపై చర్చలు మొదలు పెట్టారు. కాగా భూమా పార్టీ మారినప్పటి నుండి నంద్యాలలో తెదేపాకు కీలక పాత్ర వహిస్తున్నప్పటికీ మంత్రి పదవి రాలేదన్న కొరత వేధించిన విషయం తెలిసిందే. కానీ రాబోయే విస్తరణలో తప్పకుండా ఆయనకు మంత్రి పదవి వస్తుందని అందరూ భావించారు. అప్పట్లో భూమాకు కాకుండా అఖిలప్రియకు మంత్రిపదవి ఇచ్చి అటు కుటుంబానికి అటు యువతకు, ఇంకా మహిళలకు కూడా ప్రాతినిధ్యం కల్పించినట్టవుతుందని చంద్రబాబు భావించినట్లుగా కూడా వార్తలు వచ్చాయి. ఒకసారి ఎన్‌టివి ఇంటర్వ్యూలో ఫ్రశ్నించినప్పుడు కూడా అది ముఖ్యమంత్రి చంద్రబాబు ఇష్టమని భూమా తెలిపాడు కూడాను. అయితే ఇప్పుడు అనుకోకుండా మరణించిన భూమా కుటుంబంలో తీరని దుఃఖం నుండి తప్పించడానికి ఇలా మంత్రిపదవి తప్పకుండా ఇవ్వాలని కూడా తెదేపాలో కొంతమంది బావిస్తున్నారు.
ఇకపోతే ఈ మధ్య అఖిల ప్రియ ఎంఎల్‌ఎ అయ్యాక యాక్టివ్ గా పని చేస్తుంది. సమస్యలపై బాగానే స్పందిస్తుంది. అయితే నంద్యాల ఉప ఎన్నికకు మాత్రం తెదేపాలో మొదటి నుండి ఆనవాయితీగా మరణించిన ఎంఎల్‌ఎల కుటుంబ సభ్యులకే ఇవ్వడం అనేది ఉంది. ప్రస్తుతం అన్నీ చూసుకొని పోటీ పెట్టాలని తలిస్తే వైకాపాకు తెదేపాకు గట్టి హోరాహోరీగా పోటీ జరగడం ఖాయం. అలా కాకుండా సెంటిమెంటు పనిచేస్తే తెదేపాకు వర్కవుట్ అవుతదని, అలా కాకుంటే తెదేపా ముందు ముందు జరిగే ఎన్నికలకు ఇదే రెఫరెండంగా భావిస్తే మాత్రం చాలా తలనొప్పులు తెచ్చి పెట్టే అంశమే. చూద్దాం ముందు ముందు ఏం జరుగుతుందో. ఇది ఏమీ కాకుండా అఖిల ప్రియకు మంత్రి పదవి ఇచ్చి అలా ఉంచేద్దాం అన్నట్లుగా తెదేపా ఆలోచిస్తున్నట్టు కూడా అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తుంది.