ఇటీవల చాలామంది హీరోయిన్స్ తమపై జరుగుతున్న, గతంలో జరిగిన ఎన్నో లైంగిక వేదింపుల గురించి ఓపెన్‌గా మాట్లాడుతున్నారు. అవి నిజమేనని... సినిమా పరిశ్రమలో ఇలాంటివి తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే బాలీవుడ్‌లో కంగనారౌనత్‌తో పాటు పలు హీరోయిన్స్ ఇలాంటి అంశాలను బాగానే లేవనెత్తి, తమ గళాన్ని వినిపిస్తున్నారు. కాగా ఈ ధోరణి సౌతిండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎక్కువగా జరుగుతోందని కొందరు బహిరంగ వ్యాఖ్యలు చేస్తున్నారు. కానీ ఇప్పటివరకు దక్షిణాదిహీరోయిన్స్ పలు కారణాల వల్ల ఇలాంటివి ఓపెన్‌గా మాట్లాడలేకపోతున్నారు. కానీ ఇటీవలి కాలంలో ముఖ్యంగా హీరోయిన్ భావన సంఘటన తర్వాత మన హీరోయిన్లు కూడా ఇలాంటి విషయాలలోని అసలు గుట్టును బయటకు విప్పుతున్నారు. వరలక్ష్మి, మాదవీలత వంటి వారితో పాటు కొన్ని దక్షిణాదిభాషల్లో నటించిన రాధికాఆప్టే సైతం దక్షిణాదిహీరోలపై పలు ఆరోపణలు చేసింది. తాజాగా ఇదే విషయాన్ని మరో సీనియర్ హీరోయిన్ సైతం ఓపెన్‌గా చెప్పింది.
'భారతీయుడు'లో నటించిన కస్తూరి ... పలు తెలుగు, తమిళ చిత్రాలలో నటించింది. ఆతర్వాత ఓ డాక్టర్‌ని పెళ్లాడి అమెరికా వెళ్లిపోయింది. ఈమె తాజాగా మాట్లాడుతూ, కొందరు హీరోయిన్స్ అవగాహనారాహిత్యంతో మాట్లాడి ఇబ్బందులు పడుతూ కెరీర్ నాశనం చేసుకుంటున్నారని, కొందరు ఎక్కువ పారితోషికం డిమాండ్ చేసి ఫేడవుట్ అవుతున్నారని, మరికొందరు సరైన నిర్ణయాలు తీసుకోలేక తెరమరుగవుతున్నారని, ఇలా హీరోయిన్స్ పైకి ఎదగలేకపోవడానికి పలు కారణాలున్నాయని చెప్పింది. ఇక సినిమాఫీల్డ్‌లో కొందరికి పడక సుఖం ఇవ్వక తప్పని పరిస్థితులున్నాయని, తాను అలా ఒప్పుకోకపోవడం వల్ల కెరీర్‌ను పోగొట్టుకున్నానని తెలిపింది. తనను ఓ హీరో అలాంటి సుఖం అడిగాడని కానీ తాను నో చెప్పడంతో ఆయన చిత్రాలలో వరుస అవకాశాలు పొగొట్టుకున్నానంది.
ఆ హీరోకు ఇగో ఎక్కువని, తాను ఏది అడిగినా నో చెబితే తట్టుకోలేడని సెలవిచ్చింది. తాను ఆయనకు నో చెప్పడం వల్ల చిత్రం షూటింగ్ సమయంలో ఆయన తనపై అనవసర కోపం చూపించేవాడని, తాను ఆ హీరోతో ఒక చిత్రంలో కలిసి నటించానని అంది. మరో క్లూ ఇస్తూ అతను ప్రస్తుతం ఓ రాజకీయ వాది అని తెలిపింది. ఇక తనకు కమల్‌తో నటించడం అద్బుతమైన అవకాశం అని, రజనీ సార్ పక్కన ఇప్పటివరకు చేయలేకపోయానని చెప్పింది. మెగాస్టార్ చిరంజీవితో నటించాలనే కోరికను వెలిబుచ్చింది. కస్తూరి చెప్పిన విషయాలను కొందరు విశ్లేషిస్తూ, రాధికా ఆప్టేతో పాటు కస్తూరి చెప్పే హీరో ఇద్దరు ఒకరేనని, ఆయనెవ్వరో అందరికీ ఈజీగానే అర్దమవుతుందని గుసగుసలాడుకుంటున్నారు.