తాజాగా బాలయ్యతో 'గౌతమీపుత్ర శాతకర్ణి' చిత్రాన్ని విజయవంతం చేసి, అనుకున్న బడ్జెట్‌లో పూర్తి చేసి దర్శకునిగా, నిర్మాతగా కూడా క్రిష్ సక్సెస్ అయ్యాడు. ఇక 'గమ్యం, వేదం, కృష్ణం వందే జగద్గురుం, కంచె' వంటి చిత్రాలతో ఇప్పటికే ఆయనకు అవార్డులు, ప్రశంసలు లభించినా కూడా కమర్షియల్ చిత్రాలు తీయగలడా? లేదా? అని నిన్నమొన్నటి వరకు స్టార్ హీరోలు ఆలోచించి, కాస్త సందేహించే వారు. కానీ గౌతమీపుత్రశాతకర్ణితో ఆ అనుమానాలను కూడా క్రిష్ జయించాడు. సినిమాను అతితక్కువ వ్యవధిలోనే జెట్‌స్పీడ్‌తో పూర్తి చేసి ఔరా అనిపించాడు. కాగా తర్వాత ఆయనకు వెంకీ నుంచి పిలుపువచ్చినా ఆ చిత్రం పలు సాంకేతిక కారణాల వల్ల ఆగిపోయింది. ఓ నవల ఆధారంగా, కేవలం అందులోని అసలు పాయింట్‌ను మాత్రమే తీసుకుని తన సొంతగా స్క్రిప్ట్ పూర్తి చేసినప్పటికీ ఆ నవలా హక్కులను వేరొకరు పొందడంతో క్రిష్ ఆ ప్రాజెక్ట్‌ను పక్కనపెట్టేశాడు.
కాగా క్రిష్ తాజాగా 'మీలో ఎవరు కోటీశ్వరుడు' షో షూటింగ్ సమయంలో చిరుని కలిసి ఓ కథ చెప్పాడని, సింగిల్ సిట్టింగ్‌లోనే కొద్ది కొద్ది మార్పులతో చిరు ఓకే చెప్పాడని ప్రచారం జరుగుతోంది. ఆ కథ చిరు కోసమేనని కొందరు, కాదు.. కాదు.... చిరు తనయుడు, క్రిష్‌కి మంచిస్నేహితుడైన చరణ్ కోసమే ఆ కథ అనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. అయితే విశ్వసనీయ సమాచారం ప్రకారం ఆ స్టోరీ చిరు కోసమేనని తెలుస్తోంది. మరికొందరైతే ఏకంగా 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' జీవిత కథలో నటించాలని ఉత్సాహంగా ఉన్న చిరుకి సురేందర్‌రెడ్డి కంటే క్రిష్ మరింత మంచి చాయిస్ అనేంతగా వాదనలు వినిపిస్తున్నాయి. మొత్తానికి చిరు ఓకే చేయాలేగానీ ఐదారునెలల్లో స్టోరీతో సహా సినిమా ఫస్ట్‌కాపీని కూడా రెడీ చేయగల సమర్ధుడు క్రిష్ అనేది వాస్తవమే.