Advertisementt

సుచికి సపోర్ట్ చేయడానికి భయపడుతున్నారా!

Tue 14th Mar 2017 03:02 PM
suchi leaks,singer suchitra,support,singers  సుచికి సపోర్ట్ చేయడానికి భయపడుతున్నారా!
సుచికి సపోర్ట్ చేయడానికి భయపడుతున్నారా!
Advertisement
Ads by CJ

సుచీలీక్స్‌.. ఈ పేరు వింటేనే నేడు దక్షిణాది ఫిల్మ్‌సెలబ్రిటీలు బిత్తరపోతున్నారు. సినిమా వారి చీకటి భాగోతాలను, వారి శృతిమించిన పోకడలను ఇవి బట్టబయలు చేశాయి. సినిమా వారిపై ఇంతకాలం జరుగుతోన్న ప్రచారాలు వాస్తవమేనని నిరూపిస్తున్నాయి. సినిమా వారిని దేవుళ్లుగా కొలిచే సగటు ప్రేక్షకుడికి అసలు తత్వాన్ని బోధిస్తున్నాయి. ఇవి వీకీలీక్స్‌, పనామా లీక్స్‌ని మించిన దుమారాన్నే రేపుతున్నాయి. ఆమె ట్విట్టర్‌ ద్వారా ఎవరి ఆల్బమ్‌ లేటెస్ట్‌గా లీక్‌ అవుతుందో? ఎవరి చీకటి సుఖాలు బట్టబయలవుతాయోననే భయానక వాతావరణాన్ని ఈ సుచిలీక్స్‌ సినీ వర్గాలను పట్టిపీడిస్తున్నాయి. కాగా గాయని సుచిత్ర భర్త కమ్‌ నటుడు అయిన కార్తీక్‌ తన భార్య మానసిక పరిస్థితి బాగోలేదంటున్నాడు. ఆయన పాడిన పాటకే కొందరు వంత పాడుతున్నారు. మరికొందరు మాత్రం ఆమె అకౌంట్‌ హ్యాక్‌ అయిందంటున్నారు. కానీ ఇక్కడ ఒక్క విషయం మాత్రం వాస్తవం. ఆమె మానసిక స్థితి బాగోలేదనో, లేక ఆమె అకౌంట్‌ హ్యక్‌ అయిందనో విషయాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం, వితండవాదన సాగుతోందే కానీ అవి నిజమేనా? కాదా? అందులో ఉన్నది తామేనా? కాదా? లేక ఎవరైనా మార్ఫింగ్‌ చేశారా? అవి తాము కాదని నిరూపించుకోవాల్సింది పోయి ఏదేదో సాకులు చెప్పడం సరికాదు. మరీ బాధాకర విషయం ఏమిటంటే... ఇంతకాలంగా అందరూ సుచిత్రనే విలన్‌గా చూపించే ప్రయత్నం చేస్తున్నారే గానీ ఆమెకు మద్దతు మాత్రం తెలపలేకపోతున్నారు. ఎందువల్లో ఆమె తోటి గాయనీమణులు, ఇతర మహిళా కళాకారులు ఆమెకు మద్దతు తెలపడానికి భయపడిపోతున్నారు. ఇప్పటి వరకు ఒక్క గీత మాధురి మాత్రమే అఫిషియల్గా తన సపోర్ట్ ని తెలిపింది. ఆమెను చూసయినా ఇప్పుడు సూచి కి సపోర్ట్ పెరుగుతుందేమో చూద్దాం..! 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ