Advertisementt

అనుష్కను అంత భయంకరంగా అవసరమా..?

Tue 14th Mar 2017 09:15 AM
anushka,odd makeup,baahubali,anushka in bahubali poster  అనుష్కను అంత భయంకరంగా అవసరమా..?
అనుష్కను అంత భయంకరంగా అవసరమా..?
Advertisement
Ads by CJ

దర్శకధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం బాహుబలి2. ఈ చిత్రం ఓ వెండితెర అద్భుతమనేలా బాహుబలి మొదటి భాగం విడుదలై సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ప్రభాస్- రానా- అనుష్క, తమన్నా కాంబినేషన్‌లో విడుదలకు సిద్ధమౌతున్నబాహుబలి రెండవభాగంలో టాలీవుడ్ అప్సరస అనుష్క నట విశ్వరూపాన్ని ప్రదర్శించినట్లుగా తెలుస్తుంది.  అందం అభినయంతో ప్రేక్షకుల మెదళ్ళను కదిలించింది అనుష్క. అరుంధతిలో జేజెమ్మా అంటూ కత్తి పట్టినా, బిల్లాలో బికినీ అందాలను చవిచూపించి అభిమానుల్లో గుండెల్లో స్థిరమైన స్థానాన్ని దక్కించుకుంది.

అయితే తాజాగా బాహుబలి చిత్రంలో దర్శకుడు రాజమౌళి.. అనుష్కను వృద్దురాలిగా చూపించాడు. బాహుబలిలో అనుష్కను చూసి అభిమానులంతా విస్మయానికి గురికాకుండా ఉండలేక పోయారు. ఎందుకంటే.. అనుష్క చెరసాలలో బంధీగా కనిపించింది. మిడిల్ ఏజ్ లో అనుష్కను చూయించడానికి దర్శకుడు రాజమౌళి భయంకరంగా మేకప్ వేయాల్సి వచ్చింది. అసలు ఆ మేకప్ లో అనుష్కను చూసి జనాలు దడుసుకొనేంత పని అయింది. మిడిల్ ఏజ్ లో అనుష్కను చూయించడానికి అంతలా బీభత్సకరంగా మేకప్ వేయాల్సిన అవసరం లేదని, అందుకోసం సహజమైన పద్ధతిలోనే అనుష్కను కొంచం ఏజ్ బార్ లో చూయించవచ్చని విమర్శలు వెల్లువెత్తాయి. మొత్తానికి బాహుబలిలో అనుష్కను వృద్దురాలిగానే సరిపెట్టుకున్నారు. అయితే బాహుబలి2 సిద్ధమౌతుంది. ఇందుకు సంబంధించిన ఒక్కో పోస్టర్ బయటకు వెల్లడిస్తున్నారు చిత్ర యూనిట్. కాగా ఇదివరకే అనుష్కకు చెందిన యంగ్ లుక్ ఒకటి విడుదల చేసింది చిత్రయూనిట్. అందులో అనుష్కను టెక్నాలజీ సహాయంతో చాలా సన్నగా చూయించడం జరిగింది.

అయితే ఇప్పుడు తాజాగా మరో పోస్టర్ విడుదలైంది. ఇందులో మళ్ళీ అనుష్క వృద్దురాలిగానే మరీ భయంకరమైన మేకప్ తో ఉంది. ఇంకా ఇందులో అనుష్క తలపై నిప్పు కుంపటి ఒకటి పెట్టారు. ఆ కుంపటి ఎడిటింగ్ చేసి పెట్టినట్లుగా చాలా ఈజీగా తెలుస్తుంది. అయితే తాజాగా విడుదల చేసిన ఈ పోస్టర్ లో దాదాపు బాహుబలి మొదటి భాగంలోని ముఖాలే కనిపించాయి. అయితే ఇందులో అనుష్కకు మరీ భయంకరంగా ఆడ్ మేకప్ వేసినట్లుగా అట్టే అర్ధమౌతుంది. అయితే ఊరించి ఊరించి వదులుతున్న బాహుబలి పోస్టర్లు, ట్రైలర్లలో 16వ తేదీ నాడు వచ్చే ట్రైలర్ లోనైనా కాస్త అనుష్క అభిమానులకు దిమ్మతిరిగేలా మెరుపులు ఉంటాయేమో చూద్దాం.  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ