Advertisementt

ఇవన్నీ పాత లుక్ లే.. గా రాజమౌళి..?

Mon 13th Mar 2017 10:26 PM
ss rajamouli,prabhas,bahubali looks,bahubali 2,kattappa  ఇవన్నీ పాత లుక్ లే.. గా రాజమౌళి..?
ఇవన్నీ పాత లుక్ లే.. గా రాజమౌళి..?
Advertisement
Ads by CJ

'బాహుబలి' విడుదలకు రోజులు దగ్గర పడుతున్నాయి. ఇంకా ఎంతో వ్యవధి లేదు ఈ సినిమా విడుదలకి. అందుకే రాజమౌళి 'బాహుబలి' పబ్లిసిటీని అమాంతంగా పెంచేసాడు. ఇక ట్రైలర్ విడుదలకు కేవలం మూడు రోజులు మాత్రమే టైమ్ ఉందని రోజుకో పోస్టర్ తో జనాల్లో హైప్ క్రియేట్ చేస్తున్నాడు జక్కన్న. అయితే జక్కన్న విడుదల చేసే పోస్టర్స్ లో ఉన్న తప్పులు వెతకడంతో 'బాహుబలి'కి ఎనలేని పబ్లిసిటీ వచ్చేస్తుంది. ఇక తాజాగా విడుదల చేసిన 'బాహుబలి ద కంక్లూజన్' పోస్టర్ లో  'బాహుబలి ద బిగినింగ్' లో ఉన్న కేరెక్టర్స్ కి మెరుగులు దిద్ది మరీ పోస్టర్ ని తయారుచేశారనే చర్చ మొదలైంది. అంటే 'బాహుబలి పార్ట్ టు' కి సంబంధించి ఏ ఒక్క ఫోటో గాని పోస్టర్ గాని వదలకుండా రాజమౌళి చాలా జాగ్రత్త పడుతున్నాడు. అసలు సినిమా రిలీజ్ కి దగ్గరవుతున్నా.... ఇప్పటివరకు ఆకర్షించే ఒక ఫోటో గాని ట్రైలర్ గాని వదలకుండా రాజమౌళి చాలా సీక్రెట్ మెయింటైన్ చేస్తున్నాడు. మరలా... కాకపోతే ఇప్పటివరకు వదిలిన పోస్టర్స్ లో కట్టప్ప 'బాహుబలి'ని చంపడం అనేది ఆపాత 'బాహుబలి'లోదే. దానికి కొత్తగా కట్టప్ప బాహుబలిని ముద్దాడుతున్న ఫోటోని మాత్రమే యాడ్ చేసాడు. ఇలాగే మరొక పోస్టర్ లో 'బాహుబలి ద బిగినింగ్' లో ఉన్న ప్రభాస్, రానా, తమన్నా, కట్టప్ప, అనుష్క ఫొటోలతోనే పోస్టర్ తయారు చేయించాడు. మరి చూస్తుంటే 'బాహుబలి' సినిమా విడుదలయ్యే వరకు ఆ సినిమాకి సంబంధించి ఎటువంటి క్లూ రాజమౌళి ఇచ్చేలా కనబడడంలేదని అంటున్నారు. అయినా రాజమౌళి పనిగట్టుకుని 'బాహుబలి' కి ప్రచారం చెయ్యక్కర్లేదు. మీడియా దానంతట అదే 'బాహుబలి'ని ప్రమోట్ చేసేస్తుందిలే.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ