Advertisementt

'2.0' చిత్రం శాటిలైట్‌ రైట్స్‌ ఎంతో తెలుసా?

Mon 13th Mar 2017 08:10 PM
rajinikanth,robot 2,2.0,satellite rights,110 crores  '2.0' చిత్రం శాటిలైట్‌ రైట్స్‌ ఎంతో తెలుసా?
'2.0' చిత్రం శాటిలైట్‌ రైట్స్‌ ఎంతో తెలుసా?
Advertisement
Ads by CJ

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌-శంకర్‌ల '2.0' చిత్రం శాటిలైట్‌ రైట్స్‌ 110 కోట్లు 

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌, గ్రేట్‌ డైరెక్టర్‌ శంకర్‌ కాంబినేషన్‌లో వచ్చిన 'రోబో' ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మళ్ళీ ఇదే కాంబినేషన్‌లో రోబో చిత్రానికి సీక్వెల్‌గా రూపొందుతున్న '2.0' చిత్రంపై భారీ ఎక్స్‌పెక్టేషన్స్‌ వున్నాయి. ఆ ఎక్స్‌పెక్టేషన్స్‌కి తగ్గట్టుగానే ఇండియన్‌ సినిమాలోనే భారీ బడ్జెట్‌తో, హై టెక్నికల్‌ వాల్యూస్‌తో హాలీవుడ్‌ స్థాయిలో రూపొందుతున్న '2.0' చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ తమ మొదటి చిత్రంగా నిర్మిస్తోంది. ఈ చిత్రంలో బాలీవుడ్‌ స్టార్‌ హీరో అక్షయ్‌కుమార్‌ విలన్‌గా ఓ విభిన్నమైన పాత్ర పోషిస్తుండగా, ఎమీ జాక్సన్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. 

రోబో చిత్రానికి సీక్వెల్‌గా రజనీకాంత్‌, శంకర్‌ల కాంబినేషన్‌లో '2.0' చిత్రం రూపొందుతోందన్న వార్త బయటికి రాగానే ఈ చిత్రంపై భారీ ఎక్స్‌పెక్టేషన్స్‌ ఏర్పడ్డాయి. ఆ ఎక్స్‌పెక్టేషన్స్‌కి తగ్గట్టుగానే బిజినెస్‌ పరంగా '2.0' సెన్సేషన్‌ క్రియేట్‌ చేస్తోంది. శాటిలైట్‌ రైట్స్‌ కోసం కూడా భారీ పోటీ నెలకొంది. అంతటి పోటీ మధ్య జీ టివి ఈ చిత్రం శాటిలైట్‌ రైట్స్‌ దక్కించుకుంది. తెలుగు, తమిళ్‌, హిందీ భాషల శాటిలైట్‌ రైట్స్‌ను 110 కోట్లకు జీ తెలుగు కైవసం చేసుకుంది. ఈ చిత్రం షూటింగ్‌ పూర్తి కావచ్చింది. దీపావళి కానుకగా ఈ చిత్రాన్ని వరల్డ్‌వైడ్‌గా రిలీజ్‌ చెయ్యడానికి ప్లాన్‌ చేస్తున్నారు. 'రోబో' తర్వాత రజనీకాంత్‌, శంకర్‌ల కాంబినేషన్‌లో రూపొందుతున్న ఈ విజువల్‌ వండర్‌ శాటిలైట్‌ రైట్స్‌ 110 కోట్లకు అమ్ముడు పోవడం టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీ అయింది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ