Advertisementt

త్రివిక్రమ్ తో చైతూ ఇప్పట్లో కష్టమే.!

Mon 13th Mar 2017 07:15 PM
trivikram srinivas,naga chaitanya,akkineni akhil,trivikram movie with naga chaitanya  త్రివిక్రమ్ తో చైతూ ఇప్పట్లో కష్టమే.!
త్రివిక్రమ్ తో చైతూ ఇప్పట్లో కష్టమే.!
Advertisement
Ads by CJ

అక్కినేని అఖిల్ హీరోగా సినిమా ఆరంగేట్రంని త్రివిక్రమ్ దర్శకత్వంలోనే లాంచ్ చేద్దాం అనుకున్నారు నాగార్జున. కానీ అప్పట్లో త్రివిక్రమ్ చాలా బిజీగా ఉండటంతో కుదరలేదు. ఆ సందర్భంగా కొంత సమయం తీసుకోమన్నారు. దాంతో ఆత్రాన్ని తట్టుకోలేక ఓ సూపర్ మ్యాన్ స్టోరీతో రంగంలోకి దిగాడు అఖిల్. కానీ ఇప్పుడు రెండో సినిమా కాస్త ఆలస్యం అయినా పర్వాలేదుగానీ గట్టి కథతో చేద్దామని డిసైడై పోయాడు అఖిల్. ప్రస్తుతం విక్రమ్ కుమార్ తో ఓ సినిమా ప్రీ ప్రొడక్షన్ లో వుంది. అయితే రెండో సినిమాకి కూడా త్రివిక్రమ్ ను సంప్రదించాడు. నాగార్జున హీరోగా చేసి బ్లాక్ బస్టర్ అందించిన మన్మథుడుని అఖిల్ తో సీక్వెల్ తీద్దామన్నాడు నాగార్జున. ఆ ఆలోచన త్రివిక్రమ్ కి అంత నచ్చకపోవడంతో అంతగా సుముఖత వ్యక్తం చేయలేదు.

అయితే తాజాగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా ఒక సినిమా ఓకే అయిందన్న వార్త హల్ చల్ చేస్తుంది. అందులో వాస్తవం ఎంత ఉందో తెలియదు గానీ.. అది ఇప్పట్లో సాధ్యం అయ్యే అవకాశాలు లేవు. త్రివిక్రమ్ ఇప్పుడు వీరబిజీగా ఉన్న విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ సినిమా చేయాలి. తర్వాత ఎన్టీఆర్ సినిమా లైన్ లో వుంది. ఈ సినిమా తర్వాత మహేష్ బాబు తో ఓ మూవీ ఇప్పటికే ఫిక్స్ అయ్యి ఉండటంతో ఇప్పట్లో నాగచైతన్యతో త్రివిక్రమ్ సినిమా కష్టసాధ్యమనే విషయం అర్థమౌతుంది. ఇంకా రామ్ చరణ్ ఎప్పటినుండో క్యూలో నిలబడి మరీ ఉన్నాడు. అసలు అన్నీ కుదిరితే బన్నీ ఆ క్యూలో దూరిపోవాలని చూస్తున్నాడు. ఇంత బిజీ షెడ్యూల్ లో చైతూతో త్రివిక్రమ్ సినిమా సాధ్యమౌతుందా? చూద్దాం త్రివిక్రమ్ ఏంమాయ చేస్తాడో...?

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ