బ్యాడ్మింటన్ స్టార్ గుత్తా జ్వాలా కొత్తగా బ్యాడ్మింటన్ అకాడమీని ప్రారంభించింది. సొంతంగా గుత్తా జ్వాలానే గ్లోబల్ అకాడెమీ ఫర్ బ్యాడ్మింటన్ అనే పేరుతో హైదరాబాద్ లోని కూకట్‌పల్లిలో ఈ బ్యాడ్మింటన్ అకాడమీని ఏర్పాటు చేసినట్లు ఆమె వెల్లడించింది. అయితే గుత్తా జ్వాలా ఈ బ్యాడ్మింటన్ అకాడమీని సుమారు రూ. 20 కోట్ల వ్యయంతో ప్రారంభించామని ముందు ముందు తన ఈ అకాడమీ సేవలను ఢిల్లీ, ముంబై, బెంగుళూరు, కోల్ కతా వంటి నగరాలకు కూడా కార్యకలాపాలను విస్తరించనున్నామని తెలిపింది గుత్తా జ్వాలా. దేశమంతా కూడా ఈ గ్లోబల్ అకాడమీ బ్యాడ్మింటన్ సేవలను అందిస్తుందని గుత్తా జ్వాల తెలిపింది.
ఇంకా గుత్తా జ్వాలా మాట్లాడుతూ.. బ్యాడ్మింటన్ డబుల్స్, సింగిల్స్ రెండింటిపై సమానంగా పోటీ ఇచ్చేలా తన అకాడమీ దృష్టిపెడుతున్నట్లు వివరించింది. ఇంకా గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో కూడా మా అకాడమీ సేవలను విస్తరించి తగిన కార్యక్రమాలను చేపడతామని తెలిపింది గుత్తాజ్వాలా. చివరగా గుత్తాజ్వాల మాట్లాడుతూ... సొంతంగా ఓ బ్యాడ్మింటన్ అకాడెమీని నెలకొల్పాలన్న తన కల ఈరోజుకు నెరవేరినందుకు చాలా ఆనందంగా ఉందని గుత్తా తన మనసులోని మాటను బయటపెట్టింది.