Advertisementt

ఎన్టీఆర్ కి ఈసారి ఐటం పాప ఈ భామే..!

Mon 13th Mar 2017 06:30 PM
ntr,rakul preet singh,item song,bobby,jai lava kusa  ఎన్టీఆర్ కి ఈసారి ఐటం పాప ఈ భామే..!
ఎన్టీఆర్ కి ఈసారి ఐటం పాప ఈ భామే..!
Advertisement
Ads by CJ

బాబీ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా అతి త్వరలోనే కొత్త సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. ఎన్టీయార్ ఈ చిత్రం కోసం చాలా వెయిట్ కూడా తగ్గి మరీ షూటింగ్ కు సిద్ధమౌతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా మరో మూడు రోజుల్లోనే షూటింగ్ స్టార్ట్ చేసుకోబోతున్న ఈ చిత్రం తాలూకూ కొత్త న్యూస్ ఒకటి చక్కర్లు కొడుతుంది. కళ్యాణ్ రామ్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఇప్పటికే జై లవకుశ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్లు వార్తలు వెలువడిన విషయం తెలిసిందే.

ఇప్పుడు ఈ చిత్రానికి సంబంధించిన అందుతున్న కొత్త సమాచారం ఏంటంటే.... ఇప్పటికే ఈ చిత్రంలో రాశి ఖన్నా, నివేదాథామస్ లను హీరోయిన్ లుగా ఎంచుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు వీరిద్దరూ సరిపోరేమో అన్నట్లుగా మరో స్టార్ హీరోయిన్ ను కూడా ఓ కీలకమైన చిన్న పాత్రకోసం తీసుకోనున్నట్లు అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తుంది. ఆ హీరోయిన్ కూడా ఎవరనే విషయం తెలిసిపోయింది. ఈ చిత్రంలో చిన్న రోల్ కోసం రకుల్ ప్రీత్ సింగ్ ను తీసుకోవాలని చిత్రయూనిట్ భావిస్తున్నట్లు తెలుస్తుంది. అంతే కాకుండా ఎన్టీఆర్, రకుల్ ల మధ్య ఓ మాంచి మాస్ మసాలాలాంటి సాంగ్ కూడా ఉన్నట్లు సమాచారం. మొత్తానికి ఇక రకుల్ పాప ఐటమ్ సాంగ్ తో యంగ్ టైగర్ యమా యమాగా రెచ్చిపోతాడన్నమాట.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ