Advertisementt

ఈ హీరోయిన్ కి కూడా విడాకులొచ్చాయ్..!

Mon 13th Mar 2017 02:59 PM
veena maalik,divorce,veena malik divorce,bollywood heroine  ఈ హీరోయిన్ కి కూడా విడాకులొచ్చాయ్..!
ఈ హీరోయిన్ కి కూడా విడాకులొచ్చాయ్..!
Advertisement
Ads by CJ

గత కొద్ది కాలంగా ఎందరో సినిమా స్టార్స్ వైవాహిక జీవితాలు నిత్యం వార్తల్లో నిలుస్తున్నాయి. దక్షిణాది హీరోయిన్స్ రంభ, అమల పాల్, మీరా జాస్మిన్ వంటి వారి నుంచి ఉత్తరాదిన మలైకా అరోరా ఖాన్ వరకు ఇటీవలి కాలంలో విడాకులు మంజూరు చెయ్యమని కోరుతూ న్యాయస్థానం మెట్లు ఎక్కినవారే. మరి వారికీ నటన మీద ఉన్న మోజు తగ్గక పోవడమో... లేక నిజంగానే సంసారం బాధ్యతల్లో సఫర్ అవ్వడం వలనో ఇలా వారు తమ బంధాలను తెంచుకోవడానికే మొగ్గు చూపుతున్నారు. ఇక పిల్లల్ని కన్నాక కూడా ఈ తారామణులు ఇలా విడాకులకు కోర్టు కెక్కడం అనేది కొంచెం ఆశ్చర్యం కలిగించే విషయమే. అయితే  ఇప్పుడు ఇదే కోవకి చెందుతూ ఒకప్పటి బాలీవుడ్ హీరోయిన్ అయిన వీణామాలిక్ విడాకులకు కోర్టు కెక్కడం అది కాస్త జరిగిపోవడం జరిగింది.  

మూడు సంవత్సరాల క్రితం తనకు పెళ్ళైనప్పటినుండి  భర్త అసద్ బాషిర్ ఖాన్ కట్టక్ తో ఎంతో హ్యాపీ గా గడుపుతూ సినిమా పరిశ్రమకి దూరం అయ్యింది వీణామాలిక్. ఇద్దరు కుమారులకు జన్మ ఇచ్చిన వీణ గత మూడు నెలలుగా తన భర్తకి దూరంగా ఉంటోందట. అయితే ఈ విషయం ఎక్కడా మీడియాకి లీకు కాకుండా జాగ్రత్తపడింది వీణ. సినిమాల్లో నటించాలని కోరిక బలంగా ఉండడంతో ఆమె ఆ వైపు అడుగులు వెయ్యడం భర్త ఫ్యామిలీకి ససేమిరా ఇష్టం లేదట. ఆ విషయమై వీణకు భర్తకు విభేదాలు చోటు చేసుకోవడంతో ... అది కాస్తా విడాకులకు దారి తీసిందని అంటున్నారు. అయితే ముందుగా వీణామాలిక్ డైవోర్స్ నోటీసులు  తన భర్తకు పంపగా, భర్త  అందుకు సమాధానం ఏదీ ఇవ్వకపోగా...ఇంత వరకు అసలు కోర్టుకి కూడా హాజరు కాకపోవటంతో లాహోర్ న్యాయస్థానం వీణామాలిక్ కి విడాకులు మంజూరు చేసింది. అయితే ఆమె తన భర్త నుండి విడిపోయినప్పుడు పిల్లల బాగోగుల సంగతి ఏమిటనేది ఇంకా తెలియాల్సి వుంది.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ