Advertisementt

మంచు విష్ణు టైటిల్ తో మళ్లీ గొడవలేనా..లేక..?

Sun 12th Mar 2017 07:22 PM
manchu vishnu,aachari america yatra,manchu vishnu movie title  మంచు విష్ణు టైటిల్ తో మళ్లీ గొడవలేనా..లేక..?
మంచు విష్ణు టైటిల్ తో మళ్లీ గొడవలేనా..లేక..?
Advertisement
Ads by CJ

మంచు విష్ణు చిత్రం లక్కున్నోడు ఈ సంవత్సరం ఆరంభంలో విడుదలై బాక్సాఫీసు వద్ద బోల్తాకొట్టిన విషయం తెలిసిందే. అసలు మంచు ఫ్యామిలీకి హిట్టా ఫట్టా అన్న విషయంతో సంబంధం లేకుండా తాము అనుకుంటే అలా సినిమాలు చేసేసుకుంటూ దూసుకపోతుంటారు. అందులో భాగంగా ఈ యేడాది ప్రారంభంలోనే మంచు విష్ణుకు ఓ సినిమా ఝలక్ ఇచ్చినా అసలు ఏమాత్రం ఆగకుండా వెంటనే కార్తీక్ రెడ్డి దర్శకత్వంలో మరో సినిమాతో బిజీ అయిపోయాడు. అంటే ప్లాప్ ను సైతం పక్కన పెట్టేసి అందులో నుండి తేరుకొనేందుకు మరో సినిమాను వెంటనే ప్రారంభించి అలా సేద తీర్చుకుంటారన్నమాట. ఇది తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కిస్తున్న చిత్రం. అయితే ప్ర‌స్తుతం కార్తీక్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో న‌టిస్తున్న విష్ణుకు అనుకోకుండా మరో సినిమా అవకాశం కూడా వచ్చేసింది. తాజాగా జి.నాగేశ్వ‌ర‌రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో న‌టించ‌డానికి మంచు విష్ణు ఓకే చెప్పేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. నాగేశ్వరరెడ్డి– విష్ణు కాంబినేష‌న్‌లో ఇప్పటికే రెండు సినిమాలు వచ్చాయి. అవి రెండూ అంటే దేనికైనా రెడీ, ఈడోర‌కం ఆడోర‌కం మంచి విజ‌యాల్ని సొంతం చేసుకున్నాయని చెప్పాలి. మళ్ళీ వీరిద్దరి కాంబినేషన్ తెరపైకి రావడంతో ఇప్పుడు హ్యాట్రిక్ కి రంగం సిద్ధ‌మైనట్లుగా తెలుస్తుంది.

అయితే విషయం ఏంటంటే.. ఈ సినిమాకి టైటిల్ గా `ఆచారి అమెరికా యాత్ర‌` అని విచిత్రమైన పేరును పెట్టినట్లు సమాచారం అందుతుంది. అతి త్వ‌ర‌లోనే ఈ చిత్రం ప‌ట్టాలెక్క‌ించనున్నట్లు కూడా తెలుస్తుంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన దేనికైనా రెడీ చిత్రం బాక్సాఫీసు వద్ద మంచి విజయాన్నే సాధించినా.. ఆ చిత్రంలో వాడిన పదజాలం, భావాల కారణంగా ఓ వ‌ర్గం ప్రేక్ష‌కుల నుండి ప్రతిఘటన ఎదురైంది. వారంతా ఈ సినిమాపై మంచు ఫ్యామిలీపై విరుచుకుప‌డ్డారు. చాలా రోజులు మంచు ఫ్యామిలీకీ ఆ వ‌ర్గానికి మ‌ధ్య పెద్ద పోరాటమే జరిగింది. అయితే ఇప్పుడు కూడా అలాంటి టైటిల్ కావడంతో మరో వివాదంలోకి మంచు విష్ణు వెళ్తున్నాడా? అనే టాక్ కూడా ఫిల్మ్ నగర్ లో నడుస్తుంది. అసలు ‘ఆచారి..’ అంటేనే హీరో రోల్ ఏంటో.. ద‌ర్శ‌కుడి లక్ష్యం ఏంటో అట్టే అర్థమైపోతుందనే చెప్పాలి. కానీ గ‌తంలో జరిగిన వివాదాల్ని చెరిపేసేలా ఈ చిత్రం ఉండబోతుందా? లేకా  కొత్త గొడవలకు కారణం కాబోతుందా? అనేది ఆసక్తికరంగా మారింది. టైటిల్ అయితే ఇంట్రస్టింగ్ గానే ఉందిగానీ.. అందులో ఉండే మేటర్ తోనే ఇప్పుడు అనుమానం అంతా.. చూద్దాం ఇది ఎలా ఉంటుందో..? 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ