టాలీవుడ్‌లో అనతి కాలంలోనే గొప్ప దర్శకుడుగా పేరు తెచ్చుకున్నాడు క్రిష్. ఈయన ప్రతిభ అపారమైనదని, అనన్య సామాన్యమైనదని దర్శకధీరుడు రాజమౌళి చేత కూడా ప్రశంసలందుకున్నాడు దర్శకుడు క్రిష్. అయితే క్రిష్ చేసిన ప్రతి సినిమాకి క్రిటిక్స్ వద్ద నుండి మంచి కళాభిరుచి కలిగిన దర్శకుని సినిమా వలెనే ప్రశంసలు దక్కాయి. ఆ విధంగా దర్శకుడు క్రిష్ అంటేనే ఇక ఇండస్ట్రీ అంతా గుడ్డిగా అతడు `కచ్చితంగా మంచి సినిమాలు తీసే దర్శకుడు` అనే ఒక నమ్మకం బలంగా ఏర్పడింది.
కాగా ఇప్పుడిప్పుడే క్రిష్ కూడా బడా హీరోల మనస్సులకు దగ్గరవుతున్నాడు. ఎందుకంటే ఈ మధ్యనే నందమూరి బాలకృష్ణ 100వ చిత్రాన్ని చిరస్మరణీయమైన రీతిలో తీసి ఎన్నటికీ మరువలేని మధురమైన కావ్యంగా మలిచాడు దర్శకుడు క్రిష్. అలా బాలకృష్ణ గౌతమి పుత్ర శాతకర్ణి తర్వాత వెంకటేష్, చిరంజీవిలతో కలసి క్రిష్ ఓ చిత్రం తీయబోతున్నాడంటూ అప్పట్లో ఓ వార్త హల్ చల్ చేసింది. ప్రస్తుతం చిరంజీవి సినిమా ఇంకా చర్చల దశలోనే ఉండగా, వెంకీ సినిమా అనుకోకుండా ఆగిపోయింది. ఇలా క్రిష్ ఈసారి ఖచ్చితంగా పెద్ద హీరోలతోనే సినిమా చేస్తాడని అందరూ భావిస్తున్న తరుణంలో అందరూ ఆశ్చర్యపోయేలా దర్శకుడు క్రిష్, కల్యాణ్ రామ్‌ని కలసి ఓ కథ వినిపించాడట. క్రిష్ అనగానే.. కల్యాణ్ రామ్ ఏమాత్రం ఆలోచించకుండా.. ఇంకా చెప్పాలంటే అస్సలు కథ కూడా పూర్తిగా మనస్సు పెట్టి వినకుండా ఓకే అనేశాడని టాక్ నడుస్తుంది. అసలే బాగా ప్లాప్ ల్లో ఉన్న కళ్యాణ్ రామ్.. క్రిష్ దర్శకత్వం వహిస్తున్నాడంటే ఎగిరి గంతేసినట్లుగా సమాచారం అందుతుంది. అయితే క్రిష్ ఇక్కడో ట్విట్స్ పెట్టి కళ్యాణ్ రామ్ ను ఇరుకున పడేసే ప్రయత్నం చేశాడని అంటున్నారు సినీ వర్గాలు. సహజంగా క్రిష్ తన ప్రొడక్షన్ నుంచి సినిమా చేయాలని చూస్తున్నాడంట.. అంటే క్రిష్ తన శిష్యుల సినిమాలకు తాను నిర్మాతగా వ్యవహరిస్తున్నాడన్నమాట. దానికి సంబంధించి కథలు మాత్రం తాను అందిస్తాడంట. సినిమా అతని ప్రొడక్షన్ లోనే చేయాలని వచ్చేలా ఏదో డిస్కషన్స్ జరిగినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇదే నిజమైతే కళ్యాణ్ రామ్ ను క్రిష్ ఇబ్బంది పెట్టినట్లే అని తెలుస్తుంది. నిజంగా క్రిష్ తన శిష్యుడి సినిమా కోసం కల్యాణ్ రామ్‌ని కలిశాడా? లేకా క్రిష్ దర్శకత్వం వహించడానికే కళ్యాణ్ రామ్ వద్దకు వెళ్ళాడా? అన్నది తెలియాల్సి ఉంది. చూద్దాం ఏం జరుగుతుందో.?