బాలకృష్ణ తన 101 వ చిత్రాన్ని పూరి డైరెక్షన్ లో చాలా గ్రాండ్ గా ఓపెనింగ్ చేసాడు. ఈ కార్యక్రమానికి టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ చాలామందే హాజరయ్యారు. రాజమౌళి అయితే పూరి కొత్త సినిమాకి క్లాప్ కూడా కొట్టాడు. బాలయ్యతో 100 వ చిత్రాన్ని డైరెక్ట్ చేసిన క్రిష్, 103 వ చిత్రానికి డైరెక్టర్ గా అనుకుంటున్న బోయపాటి శ్రీను, ఎస్.వి కృష్ణ రెడ్డి వంటి డైరెక్టర్స్ హాజరయ్యారు. ఇంకా ఈ కార్యక్రమానికి టాలీవుడ్ హీరోస్ నారా రోహిత్, సుధీర్ బాబు లు హాజరయ్యారు. మరి ఇప్పటికే సుధీర్ బాబు కి బాలయ్య చిత్రంలో విలన్ రోల్ ఇచ్చినట్లు దానిని సుధీర్ బాబు ఒకే చేసినట్లు వార్తలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. అందుకే బాలకృష్ణ ఓపెనింగ్ కి ఈ కుర్ర హీరో హాజరయ్యాడనే టాక్ స్ప్రెడ్ అయ్యింది.
ఇకపోతే పూరి - ఛార్మి కలిసి బాలకృష్ణ చిత్రానికి కాస్టింగ్ కాల్ అంటూ తెగ హడావిడి చేశారు. ఛార్మి కూడా పూరి కాంపౌండ్ నే అంటిపెట్టుకుని పూరికి చేదోడు వాదోడుగా ఉండడం వల్ల బాలయ్య కొత్త చిత్రంలో ఛార్మికి ఒక పాత్ర పూరి సెట్ చేసాడనే ప్రచారం జరిగింది. ఇక ఛార్మికి మళ్ళీ మంచి రోజులు వచ్చాయని అనుకున్నారు చాలామంది. మరి ఛార్మి గనక ఈ చిత్రంలో ఉంటే పూరి - బాలయ్య చిత్ర ఓపెనింగ్ లో ఎక్కడా కనబడలేదు? అంటే ఛార్మి ఈ చిత్రంలో చెయ్యడం లేదా? అనే సందేహాలు వెలిబుచ్చుతున్నారు కొందరు. అందుకే ఓపెనింగ్ కి రాకుండా దూరంగా ఉందని అంటున్నారు. పాపం బాలయ్య 101 చిత్రంలో ఛాన్స్ కొట్టేసిందనుకున్న ఛార్మి కి ఇప్పుడు పూరి నుండి కూడా మొండి చెయ్యి ఎదురై వుంటుందనే సానుభూతి మాటలు వినబడుతున్నాయి.