Advertisementt

'పటాస్' అక్కడ ఫ్లాప్..!

Sun 12th Mar 2017 08:49 AM
patas,motta siva ketta siva,raghava lawrence,tamil,flop  'పటాస్' అక్కడ ఫ్లాప్..!
'పటాస్' అక్కడ ఫ్లాప్..!
Advertisement
Ads by CJ

కళ్యాణ్ రామ్ కి 'అతనొక్కడే' సినిమా తర్వాత దాదాపు 10  ఏళ్ళకి 'పటాస్' తో హిట్ దక్కింది. ఈ మధ్యలో వచ్చిన కళ్యాణ్ రామ్ చిత్రాలన్నీ సోదిలోకి లేకుండా పోయాయనేది సత్యం. అయితే అనిల్ రావిపూడి ఇచ్చిన 'పటాస్' హిట్ తో కళ్యాణ్ రామ్ కి కాస్త ఊరట కలిగింది. 'పటాస్' హిట్ తో అనిల్ రావిపూడి పేరు కూడా ఇండస్ట్రీలో మార్మోగిపోయింది. తెలుగులో సూపర్ హిట్ అయిన ఈ 'పటాస్' చిత్రాన్ని రాఘవ లారెన్స్ హీరోగా 'మోట్ట శివ - కెట్ట శివ' పేరుతొ తమిళంలో రీమేక్ చేసాడు. అక్కడ కూడా 'పటాస్' రీమేక్... హిట్ అవుతుందేమో అని ఆశపడిన రాఘవ 'పటాస్' రీమేక్ 'మోట్ట శివ - కెట్ట శివ' ఫలితాన్ని చూసి షాకయ్యాడట. ఈ వారమే ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ  'మోట్ట శివ - కెట్ట శివ' చిత్రం నిరాశే మిగిల్చిందని తమిళ్ వెబ్ సైట్స్ చీల్చి చెండాడుతున్నాయి. అక్కడ రాఘవ - నిక్కీ గల్రాని జంటగా నటించిన ఈ 'మోట్ట శివ - కెట్ట శివ' చిత్రానికి 5  రేటింగ్ కి  1  ఇచ్చారంటే ఈ సినిమా ఎంతటి ఘోరమైన ప్లాపుని మూటగట్టుకుందో అర్ధమవుతుంది. మరి నిక్కీ అందాలు, లక్ష్మి రాయ్ ఐటెం సాంగ్, రాఘవ యాక్షన్ కూడా ఈ సినిమాని కాపాడలేకపోయాయి అంటే ఆ దర్శకుడు ఈ చిత్రాన్ని ఎంత ఛండాలంగా తెరకెక్కించాడో అని అనుకోవాలి. మరి తెలుగులో హిట్ అయినా  'పటాస్' ఇక్కడ పటాసులు పేల్చితే అక్కడ తమిళంలో మాత్రం తుస్సుమంది.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ