Advertisementt

బాలయ్య విలన్ ఆ హీరోయేనా...?

Sat 11th Mar 2017 10:13 PM
sudheer babu,balakrishna,puri jagannadh,villain  బాలయ్య విలన్ ఆ హీరోయేనా...?
బాలయ్య విలన్ ఆ హీరోయేనా...?
Advertisement
Ads by CJ

బాలకృష్ణ - పూరి సినిమా అధికారికంగా ప్రారంభమయ్యింది. ఇక రెగ్యులర్ షూటింగ్ కూడా ఈ నెల 16 నుండే మొదలు కాబోతుంది. అయితే ఇందులో ఒక్క బాలయ్య తప్ప మిగతా టెక్నీషియన్స్ ని ఇంకా పూరి సెట్ చెయ్యలేదు. ఇకపోతే మొన్నామధ్యన బాలకృష్ణ సినిమాకి కాస్టింగ్ కాల్ అంటూ ఒక ప్రకటన ఇచ్చిన పూరి ఇంతవరకు బాలకృష్ణ పక్కన నటించే హీరోయిన్స్ ని కూడా ఫైనల్ చెయ్యలేదు. అయితే తాజాగా ఇప్పుడు పూరి, బాలయ్య చిత్రానికి విలన్ దొరికాడంటున్నారు. బాలకృష్ణ సినిమాలో హీరో సుధీర్ బాబు విలన్ గా నటించాబోతున్నాడనే వార్తలొస్తున్నాయి.

అందుకే సుధీర్ బాబు, బాలయ్య సినిమా ఓపెనింగ్ అప్పుడు అక్కడే వున్నాడని అంటున్నారు. ఇప్పటికే హీరోగా గుర్తింపు తెచ్చుకుంటున్న సుధీర్ బాబు హిందీలో 'భాగీ' చిత్రంలో విలన్ గా మెప్పించాడు. మరి పూరి డైరెక్ట్ చేసే సినిమాల్లో విలన్ పాత్రని చాలా స్ట్రాంగ్ గా డిజైన్ చేస్తాడు. అంటే ఇప్పుడు మనం సుధీర్ బాబు ని స్ట్రాంగ్ విలన్ గా చూడబోతున్నామన్నమాట. మరి సుధీర్ బాబునే అంత పవర్ ఫుల్ గా చూపిస్తే ఇక బాలకృష్ణ ని ఇంకెంత పవర్ ఫుల్ గా చూపిస్తాడో అనే టాక్ మొదలైంది. అయితే సుధీర్ బాబు.. బాలయ్య చిత్రంలో విలన్ గా చేస్తున్నాడనే విషయాన్ని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ