Advertisementt

ఓంకార్ టాలెంట్ పై నాగ్ ప్రశంసలు..!

Sat 11th Mar 2017 08:04 PM
ohmkar,raju gari gadi 2,nagarjuna,praises  ఓంకార్ టాలెంట్ పై నాగ్ ప్రశంసలు..!
ఓంకార్ టాలెంట్ పై నాగ్ ప్రశంసలు..!
Advertisement
Ads by CJ

తెలుగు బుల్లితెర యాంక‌ర్‌గా ఓంకార్ అందరికీ పరిచయమే. బుల్లితెరను ఏలిన ఓంకార్ తనలోని సృజనను వెండితెరపై చూపించాలన్న ఉత్సాహంతో మొదట జీనియస్ అనే చిత్రాన్ని తీశాడు. అది అట్టర్ ప్లాప్ అయినా కూడా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా కొన్నాళ్ళ పాటు గ్యాప్ తీసుకొని మరీ ఓ హార‌ర్ కామెడీ చిత్రాన్ని తీశాడు. ఆ చిత్రం పేరే రాజు గారి గది. తెలుగు వెండితరపై ఈ చిత్రం మంచి ఘనవిజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఆ చిత్రం ఇచ్చిన సూపర్ హిట్ దానికి సీక్వెల్ గా నాగార్జున‌తో సినిమా చేసే అవకాశం దక్కించుకుంది.  ఈమధ్యనే ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్ళి హీరో నాగార్జునపై కొన్ని కీలకమైన సన్నివేశాలు కూడా చిత్రించాడు దర్శకుడు ఓంకార్. అయితే ఆ తర్వాత వెంటనే ఓంకార్ వాటిని కట్ చేసి స‌ర‌దాగా ర‌షెష్‌ని నాగ్ కు చూపించాడట. అప్పుడు నాగార్జున చాలా ఆశ్చర్యపోయి మరీ `చాలా బాగా తీశావ్‌ ఓంకార్… అవుట్ పుట్  ఇంత బాగా వస్తుందని నేను అస్సలు ఊహించ‌లేదు. నీలో ప్ర‌తిభ ఉంది. గొప్ప ద‌ర్శ‌కుడవు అవుతావ్‌` అంటూ కింగ్ నాగార్జున స్టైల్లో ఓంకార్‌ని పొగిడాడంట. ఇంకే ముంది ఓంకార్ సెట్ లోనే ఉబ్బితబ్బిబ్బై... సెట్ లోనే రింగులు తిరుగుతూ ఇంకా కసిగా పనిచేస్తూ సెట్ ని వదిలిపెట్టడం లేదంట ఓంకార్. నిజంగా ఓంకార్ తీస్తున్న రాజుగారి గది2లో ఫైనల్ అవుట్‌పుట్  ఇలాగే వచ్చి మంచి హిట్ వస్తే నాగ్ ఖాతాలో, ఓంకార్ ఎకౌంట్‌లో ఖచ్చితంగా మంచి విజయవంతమైన చిత్రం రావడం ఖాయం అంటున్నారు సినీవర్గాలు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ