Advertisementt

రాఘవేంద్రుడి చివరి చిత్రం కోసం మెగా స్కెచ్.!

Sat 11th Mar 2017 05:47 PM
k raghavendra rao,om namo venkatesaya,krr,nagarjuna  రాఘవేంద్రుడి చివరి చిత్రం కోసం మెగా స్కెచ్.!
రాఘవేంద్రుడి చివరి చిత్రం కోసం మెగా స్కెచ్.!
Advertisement
Ads by CJ

దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ఓం న‌మో వేంక‌టేశాయ‌ సినిమా చేసి ఇక సినిమాల పరంగా రిటైర్ అయిపోదామ‌నుకొన్న విషయం తెలిసిందే. అయితే సినీ పరిశ్రమలో ఒక వెలుగు వెలిగిన దర్శకేంద్రుడు ప్లాప్ సినిమాతో రిటైర్ తీసుకోవడం ఇష్టం లేక ఆ నిర్ణయంపై వెన‌క్కి తగ్గినట్లుగా తెలుస్తుంది. రాఘవేంద్రరావు దర్శకత్వంలో రీసెంట్ విడుదలైన చిత్రం ఓం నమో వేంకటేశాయ. ఈ చిత్రం విడుదలై నిరాశను మిగిల్చిన విషయం తెలిసిందే. అటు దర్శకుడు, హీరో అందరినీ ఈ చిత్రం నిరుత్సాహ పరచింది.  దీంతో రాఘవేంద్రుడు బాగా ఆలోచించి ఇటువంటి ప్లాప్ చిత్రంతో తన సినీ జీవితానికి స్వస్తి పలకడం ఇష్టంలేక, ఓ భారీ కమర్షియల్ సినిమా చేసి ఆ తర్వాత తన సినీ జివితానికి శుభం కార్డు వేయాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది.

సహజంగా రాఘవేంద్రుడు క‌మ‌ర్షియ‌ల్ సినిమాలు తీయడంలో దిట్ట అనే చెప్పవచ్చు. అసలు తెలుగు సినిమాకి క‌మ‌ర్షియాలిటీని అద్ది ఎలా సినిమాలను మలచాలో నేర్పింది ఆయ‌న‌ అంటే అతిశయోక్తి కాదు.  అందుచేతనే చివరి సారిగా ఓ భారీ క‌మ‌ర్షియ‌ల్ సినిమా తీసి, ఆ చిత్రం సృష్టించే ప్రభంజనంతో తన కెరీర్ కు ఘనంగా రిటైర్ పలకాలని భావిస్తున్నట్లుగా తెలుస్తుంది. అందుకోసం అప్పుడే రాఘవేంద్రుడు ఓ స్క్రిప్టును కూడా తయారు చేసుకొని పెట్టుకున్నట్లుగా అందిన సమాచారాన్ని బట్టి అర్థమౌతుంది. ఈ సబ్జెక్టు ఓ మంచి సోష‌ల్ మెసేజ్ రూపంలో ఉండేదిలా ఉందని అర్థమౌతుంది. ఆ స్క్రిప్ట్ కు ప్రస్తుతం తుది మెరుగులు దిద్దుతున్నార‌ని తెలుస్తుంది.  అసలు రాఘ‌వేంద్ర‌రావు అడగాలే గానీ ఏ హీరో అయినా సరే సినిమా చేయడానికి సిద్ధంగా ఉంటాడు. కానీ ఏదైనా మంచి మాస్ హీరోతోనే సినిమా చేయాలంటే ఆ హీరోను బట్టి మళ్ళీ రాఘవేంద్రుడు కథను రూపొందించుకోవాల్సి వస్తుంది. ఈ తతంగం అంతా కావడానికి ఆలస్యం అవుతుండటంతో ప్రస్తుతానికి కుమారుడు ప్ర‌కాష్ కోవెలమూడి తీస్తున్న సినిమాకు దర్శకుడుగా సహాయం అందిస్తున్నట్లు తెలుస్తుంది. కుమారుడు సినిమా పూర్తయ్యాక రాఘవేంద్రుడు తన సినిమాని మొదలెట్టాలని చూస్తున్నట్లుగా టాక్ నడుస్తుంది. మొత్తానికి రాఘవేంద్రుడు తీసుకున్న హిట్ తర్వాత రిటైర్మెంట్ నిర్ణయం చాలా బాగానే ఉంది మరి. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ