Advertisementt

తేడా వస్తే..ఇక పూరి పని అవుటే..!

Sat 11th Mar 2017 03:02 PM
puri jagannadh,balakrishna,bhavya creations  తేడా వస్తే..ఇక పూరి పని అవుటే..!
తేడా వస్తే..ఇక పూరి పని అవుటే..!
Advertisement
Ads by CJ

అసలు పూరి జగన్నాథ్ తాను తీసిన సినిమాల ఫలితాలు ఎలా ఉన్నాసరే అతను తీసుకునే పారితోషకం మాత్రం అస్సలు తగ్గించడు. తాను తీసిన సినిమాలు వరుస ప్లాపులతో సతమతమవుతున్న పూరికి ఇప్పుడు అవకాశాలు లేక పెద్ద హీరోలతో సినిమాలు చెయ్యడం లేదు. కానీ బాలకృష్ణ అనూహ్యం గా పూరీని పిలిచి తన 101 వ చిత్రాన్ని తెరకెక్కించే బాధ్యతని పెట్టాడు. ఇక పూరి కూడా బాలయ్య విషయంలో తేడా వస్తే తన పని అవుట్ అనుకున్నట్లున్నాడు. అందుకే బాలయ్య చిత్రాన్ని వళ్ళు దగ్గర పెట్టుకుని తెరకెక్కించడానికి రెడీ అయ్యాడు. అయితే ఇప్పుడు ఆ చిత్రాన్ని కేవలం 25  కోట్ల బడ్జెటుతోనే తెరకెక్కిస్తానని భవ్య క్రియేషన్స్ నిర్మాతలకి మాట ఇచ్చాడట పూరి. అంటే ఆ 25  కోట్ల బడ్జెట్ లోనే పూరి పారితోషకం కూడా ఉంటుందట. ఆ 25  కోట్లలోనే ఇతర టెక్నీషియన్స్ కి బడ్జెట్ కేటాయించాలి... ఇంకా బాలయ్య చిత్రానికి ఫారిన్ లొకేషన్స్ నే ఎక్కువ వాడతానని అంటున్న పూరి బాలయ్య చిత్రాన్ని 25  కోట్ల బడ్జెట్ లోనే పూర్తిచెయ్యాలన్నమాట. అందులో ఏవిధమైన తేడా వచ్చిన పూరి పారితోషకంలో కోత విధింప బడుతుందన్నమాట. మరి పారితోషకం విషయంలో ఎప్పుడూ గట్టిగా వుండే పూరి, బాలయ్య కోసం కంట్రోల్ అయ్యాడనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఏదిఏమైనా బాలయ్య చిత్రాన్ని షార్ట్ టైం లో తీసి హిట్ కొట్టాలనే కసిగా ఉన్నట్లు పూరి కనబడుతున్నాడు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ