Advertisementt

మహేష్ లుక్ అదిరిపోయింది..!

Sat 11th Mar 2017 02:54 PM
mahesh babu,smart look  మహేష్ లుక్ అదిరిపోయింది..!
మహేష్ లుక్ అదిరిపోయింది..!
Advertisement
Ads by CJ

మహేష్ బాబు, నమ్రతని పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలకి తండ్రి కూడా అయ్యాడు. అయినా మహేష్ మాత్రం ఇప్పటికి టీనేజ్ కుర్రాడిలాగే కనబడతాడు. మహేష్ సినిమాల్లో కూడా ఇంకా చాలా యంగ్ గానే కనిపిస్తున్నాడు. పిల్లలు గౌతమ్, సితారలు పెద్ద వాళ్ళు అవుతున్నా కూడా మహేష్ ఇంకా చాలా యంగ్ లుక్ లోనే కనబడుతున్నాడు. అయితే ఎప్పుడూ ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేస్తూ ఎటువంటి టెంక్షన్ పెట్టుకోకుండా తన పని తానూ చేసుకుంటూ వివాదాలకు దూరంగా వుండే మహేష్ ఇప్పుడు డైరెక్టర్ మురుగదాస్ డైరెక్షన్ లో బైలింగ్యువల్ లో నటిస్తున్నాడు. ఇక ఈ చిత్రానికి సంబంధించి ఫస్ట్ లుక్ ఇంతవరకు ఆ చిత్ర యూనిట్ బయటపెట్టలేదు గాని మహేష్ లుక్ ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. ఆ ఫొటోలో మహేష్ చాలా యంగ్ గా స్మార్ట్  లుక్ తో అందరిని ఆకట్టుకుంటున్నాడు. అయితే ఆ రాకింగ్ లుక్ మురుగదాస్ చిత్రంలోనిదా లేకపోతె వేరేదా అనేది మాత్రం తెలియాల్సివుంది. ఇక మహేష్ - మురుగదాస్ కాంబినేషన్లో తెరకెక్కే చిత్రానికి ఇంకా టైటిల్ కూడా ఫిక్స్ అవ్వలేదు. టైటిల్ ఫిక్స్ అవ్వని కారణం గా మహేష్ ఫస్ట్ లుక్ ని వాయిదా వేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇక ఈ చిత్రంలో మహేష్ కి జోడిగా రకుల్ ప్రీత్ సింగ్ మొదటిసారి నటిస్తోంది.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ