పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం కాటమరాయుడు చిత్రం షూటింగ్ లో బిజీబిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ నెలాఖరులో ఈ చిత్రం విడుదల ఉండటంతో ఈ సినిమాకు సంబంధించిన పనులలో తీరిక లేకుండా గడుపుతున్నాడు పవన్. అయితే ఈ చిత్రం విడుదల అయిన వెంటనే పవన్ అస్సలు గ్యాప్ అనేదే తీసుకోకుండా త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా ప్రారంభం చేస్తాడన్న విషయం తెలిసిందే. అయితే పవన్- త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చే ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులన్నింటినీ త్రివిక్రమ్ ఇప్పటికే పూర్తి చేసిన విషయం తెలిసిందే. అయితే వీరి కాంబినేషన్ లో తెరకెక్కబోయే చిత్రం కోసం ఇప్పటికే రామోజీ ఫిల్మ్ సిటీలో దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఓ భారీ సెట్ వేసినట్లుగా సమాచారం అందుతుంది. అందుకోసం త్రివిక్రమ్ రూ.5 కోట్ల వరకు ఖర్చు పెట్టినట్లుగా తెలుస్తుంది. టాలీవుడ్ లో ఇప్పటి వరకు వేసిన భారీ సెట్ లో ఇదీ ఒకటి అన్న రీతిలో అప్పుడే పరిశ్రమలో టాక్ నడుస్తుంది. ఈ సినిమాకే ఈ సెట్ చాలా కీలకమని అర్థమౌతుంది. అసలు ఈ సినిమాలో ఎక్కువ సన్నివేశాలు ఈ సెట్ లోనే షూటింగ్ జరుపుతారని కూడా ప్రచారం జరుగుతుంది. అయితే అత్తారింటికి దారేది చిత్రం కోసం ఆర్ట్ డైరెక్టర్ రవీందర్ ఓ భారీ సెట్ ను వేశాడు. ఆయన ఇప్పుడు ఈ సెట్ ను వేసినట్లు తెలుస్తుంది. కాగా ఇప్పటికే సెట్ వేయడం అంతా పూర్తయిందని, తాజాగా త్రివిక్రమ్ ఆ సెట్ ను సందర్శించి కొన్ని మార్పులు చేర్పులు సూచించినట్లు కూడా సమాచారం అందుతుంది.