Advertisementt

ఈ ఇద్దరి మధ్య వివాదం ముదురుతోంది..!

Sat 11th Mar 2017 01:20 PM
kangana ranaut,karan johar  ఈ ఇద్దరి మధ్య వివాదం ముదురుతోంది..!
ఈ ఇద్దరి మధ్య వివాదం ముదురుతోంది..!
Advertisement
Ads by CJ

బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్, దర్శక నిర్మాత కరణ్ జోహార్ ల మధ్య వ్యవహారం ముదురుతున్నట్లుగానే తెలుస్తుంది. రోజురోజుకు వీరిద్దరి మధ్య గ్యాప్ ఎక్కువవుతున్నట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే వీరిద్దరి మధ్య  ఏర్పడిన గ్యాప్ వ్యక్తిగత దూషనలకు దారితీస్తున్నట్లుగా అర్థమౌతుంది. అందుకనే ఒకరికొకరు మాటల తూటాలు పేల్చుకుంటున్నట్లుగా తెలుస్తుంది. అసలు వీరిద్దరి మధ్య మాటపట్టింపులో తేడా రావడానికి కారణం కరణ్ జోహార్ తో కలిసి కంగనా రనౌత్ కాఫీ విత్ కరణ్ కార్యక్రమంలో  ఏర్పడిన మనస్ఫర్థలేనని చెప్పవచ్చు. అది కాస్త హద్దులు మీరి వ్యక్తిగత దూషణలకు కూడా దారితీస్తుందని చెప్పవచ్చు.

మొదట బాలీవుడ్ భామ కంగనా రనౌత్, కరణ్ గురించి మాట్లాడుతూ..'కరణ్ నెపోటిజంకు ఫ్లాగ్ బేరర్' అంటూ ఆరోపించింది. అంతటితో ఆగకుండా కరణ్ మూవీ మాఫియా నడుపుతున్నాడంటూ కూడా వ్యాఖ్యానించింది. ఆ కార్యక్రమానికి చెందిన ఆ ఎపిసోడ్ ను ఏమాత్రం ఎడిట్ కూడా చేయకుండా అలాగే ఉంచి మరీ యథాతథంగా టెలికాస్ట్ చేసేశారు. అంటే కంగనా చేసిన కామెంట్లను కరణ్ అంగీరించాడా? అని కూడా ఆ షో చూసిన వారంతా భావించారు కూడాను.  అయితే ఈ మధ్య లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన కరణ్ జోహార్ ..అసలు కంగనాకు నెపోటిజం అంటే అర్థం తెలుసా?  అంటూ తనదైన శైలిలో వ్యాఖ్యానించాడు. అంతటితో ఆగిపోకుండా కరణ్ కూడా ఏమాత్రం తగ్గకుండా అసలు కంగనాను  ఇక్కడ ఎవరు ఉండమన్నారు అంటూ, అంత అయిష్టంగా ఉండటం ఎందుకు. ఆమెకు ఇష్టం వచ్చిన చోటకు వెళ్ళచ్చు కదా అంటూ తన అభిప్రాయాన్ని కాస్త కటువుగానే వ్యక్తం చేశాడు. అంతే కాకుండా ఆమె మాటి మాటికీ మహిళ, విక్టిం వంటి వాటిని కూడా ఉపయోగించడం గురించి కూడా ప్రస్తావించాడు.

అయితే కరణ్ పేల్చిన వాక్బాణాలకు కంగనా ఏమాత్రం తగ్గకుండా ప్రతిస్పందనను ఘాటుగానే స్పందించినట్లు  తెలుస్తుంది. కాగా తాజాగా కరణ్ పై కంగానా స్పందిస్తూ... 'నేను ఎక్కడుండాలో ఆయన నాకు చెప్పాల్సిన అవసరం లేదు. నాకు తెలుసు నేను ఎక్కడ ఉండాలో.. సినీ పరిశ్రమ అనేది వాళ్ళ నాన్న ఆయనకు రాసిచ్చిన ఆస్తేం కాదు. నేను బ్యాడ్ యాస్ కార్డ్ కూడా ఉపయోగించా. కావాలంటే.. ఆయన కూతురుకు కరణ్ మహిళా కార్డు, విక్టిం కార్డ్, బ్యాడ్ యాస్ కార్డులలో ఏదైనా ఇవ్వచ్చు. వారికిష్టమొచ్చింది వాడుకోమని కూడా చెప్పవచ్చు' అంటూ కంగనా చాలా ఘాటుగా కరణ్ పై వ్యాఖ్యలు చేసింది. విషయం ఏంటంటే.. ఈ మధ్యనే కరణ్ ఇద్దరు కవల పిల్లలను దత్తత తీసుకున్న విషయం తెలిసిందే. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ