అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ సన్నీలియోన్ గురించి సంచలనం రేపే ట్వీట్స్ చేసిన విషయం తెలిసిందే. అయితే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చేసిన ట్వీట్స్ గత రెండు రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న విషయం తెలిసిందే. అంతటితో ఆగకుండా కొంతమంది ఆయనపై కేసులు కూడా వేశారు. ఇలా రోజురోజుకూ ఈ ట్వీట్స్ పై దుమారం తాలూకూ తాకిడి ఎక్కువౌతుంటే ఎట్టకేలకు వర్మ ఈ ట్వీట్స్ పై వెనక్కి తగ్గినట్లుగా మరోసారి ట్వీట్స్ వేశాడు. కాగా వర్మ మహిళా దినోత్సవం రోజు వేసిన ట్వీట్స్ పై వివరణ ఇచ్చాడు. మహిళా దినోత్సవం రోజు తాను చేసిన ట్వీట్స్ తన అభిప్రాయాన్ని మాత్రమే వ్యక్తం చేసినవని, అవి ఎవరినైనా బాధించి ఉంటే మన్నించాలంటూ మరో ట్వీట్ చేశాడు రామ్ గోపాల్ వర్మ.
ఇంకా వర్మ మాట్లాడుతూ.. మరో వివాదాస్పద విషయాన్ని కూడా వ్యక్తం చేశాడు. తన ట్వీట్ల ద్వారా ఆ ట్వీట్లను బేస్ చేసుకొని పబ్లిసిటీని పెంచుకోవాలని చూసుకొనే వాళ్ళకు తాను క్షమాపణలు చెప్పడం లేదన్నట్లుగా వర్మ ట్వీట్ల ద్వారా వెల్లడించాడు. మొత్తానికి వర్మ భలే అనేశాడుగా. అసలు ఇలాంటి ట్వీట్లు చేసేదే పబ్లిసిటీ కోసం... ఏదో సమాజంలోని కొన్ని వింతలను గెలకడం కొంతమంది స్వభావం. అలా అలా వాళ్ళు అలాంటి దూలను తీర్చేసుకుంటుంటారన్న విషయం తెలిసిందే. అయితే వర్మ అన్నట్లు ఈయన పబ్లిసిటీని కూడా క్యాష్ చేసుకొని ఇంకా పబ్లిసిటీ పెంచుకోవడానికి కొంతమంది ఆరాటపడుతున్నారంటూ వర్మ ట్వీట్స్ ఇంకా ఆలోచనలో పడేశాయి. అయితే వర్మ వుమెన్స్ డే సందర్భంగా ఏం ట్వీటాడంటే... సన్నీలియోన్ తరహాలోనే ప్రపంచంలోని మహిళలంతా పురుషులకు అమిత సుఖాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనేశాడు. ఇంకేముంది ఈ ట్వీట్ తో దేశవ్యాప్తంగా వర్మపై పలు కేసులు నమోదయ్యాయి.