Advertisementt

కొత్త టైటిల్స్ అదిరిపోలా....!

Fri 10th Mar 2017 06:31 PM
rarandoiah veduka chuddam,nagarjuna,naga chaitanya,chiranjeevi  కొత్త టైటిల్స్ అదిరిపోలా....!
కొత్త టైటిల్స్ అదిరిపోలా....!
Advertisement
Ads by CJ

టాలీవుడ్ లో కొత్త సినిమాలు ఓపెనింగ్ జరుపుకుని సెట్స్ మీదకెళ్ళిపోతున్నాయి. కొన్ని సినిమాలు మొదలైనా ఇంకా టైటిల్స్ పెట్టకుండా షూటింగ్ జరిపేసుకుంటున్నారు. కానీ మరికొన్ని సినిమాలు మొదలుకాకముందే ఆయా హీరోలకు తగ్గ టైటిల్స్ ని నిర్మాతలు రిజిస్టర్ చేయించేస్తున్నారు. ఇక ఇప్పుడు రీసెంట్ గా ఓపెన్ అయ్యే చిత్రాల టైటిల్స్ చూస్తే కొంచెం కొత్తగా అనిపించకమానవు. చిరంజీవి తన 151  వ చిత్ర టైటిల్ ని రామ్ చరణ్ కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై  'ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి' అనే టైటిల్ రిజిస్టర్ చేయించాడు. మరి ఈ చిత్రానికి దర్శకుడిగా సురేందర్ రెడ్డి పేరైతే ప్రచారంలో వుంది. ఇక అక్కినేని నాగార్జున తాజాగా అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై 'రారండోయ్ వేడుక చూద్దాం' అనే ఫ్యామిలీ టైటిల్ రిజిస్టర్ చేయించినట్టు సమాచారం. 'రారండోయ్ వేడుక చూద్దాం' అనే టైటిల్ ని నాగార్జున, నాగ చైతన్య కోసం రిజిస్టర్ చేయించాడా... లేకపోతె అఖిల్ కోసమా.....  అదీకాకపోతే తనకోసమా అనేది ఇంకా స్పష్టత రావాల్సి వుంది. ఇక 'రారండోయ్ వేడుక చూద్దాం' టైటిల్ కి మాత్రం డైరెక్టర్ గా విక్రమ్ అని ప్రచారమైతే మొదలైంది.

ఇంకా నాగ వంశీ తన ఓన్ బ్యానర్ సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై 'అదిగో అల్లదిగో శ్రీహరివాసం' అనే టైటిల్ రిజిస్టర్ చేయించినట్టు సమాచారం. ఇకపోతే నిర్మాత సి కళ్యాణ్ బాలకృష్ణ కోసం కె. ఎస్ రవికుమార్ డైరెక్షన్ లో 'జయసింహ' అనే టైటిల్ రిజిస్టర్ చేయించినట్లు తెలుస్తుంది. ఈ చిత్రం పూరి తో బాలకృష్ణ సినిమా కంప్లీట్ అయ్యాక ఉంటుందని అంటున్నారు. అలాగే అల్లరి నరేష్ కోసం 'పక్కింటి అబ్బాయి' అనే టైటిల్ ని నమోదు చేయించినట్లు ఫిలింనగర్ సర్కిల్స్ లో టాక్ వినబడుతుంది. మరి ఈ టైటిల్స్ ఆయా హీరోలకు చక్కగా సరిపోయేటట్లు ఉన్నాయి కదా... అయినా ఈ టైటిల్స్ తో సినిమాలు మొదలుపెట్టి విడుదలయ్యే వరకు సస్పెన్సే. చూద్దాం ఏం జరుగుతుందో.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ