Advertisementt

ఆ కథే అయితే బాలయ్యకి బ్లాక్ బస్టరే..!

Fri 10th Mar 2017 06:41 PM
balakrishna,auto johnny,puri jagannadh,pawan kalyan,mahesh babu,raviteja  ఆ కథే అయితే బాలయ్యకి బ్లాక్ బస్టరే..!
ఆ కథే అయితే బాలయ్యకి బ్లాక్ బస్టరే..!
Advertisement
Ads by CJ

డైరెక్టర్ పూరి జగన్నాథ్ తనేమనుకుంటే అదే చేస్తాడు. ఇతరుల సలహాలతో సంబంధం లేకుండా తనకేం అనిపిస్తే అది సినిమా తీసి వస్తే హిట్టు లేకపోతె ఫట్టు అనే ధోరణిలో సినిమాలు చేసుకుంటూ పోతాడు. అలాంటి పూరి కాంబినేషన్లో బాలకృష్ణ తన 101  చిత్ర బాధ్యతల్ని పెట్టాడు. మరి ఆ బాధ్యతని పూరి ఏవిధంగా నిర్వర్తిస్తాడో తర్వాతి సంగతి గాని ఇప్పుడు పూరి గురించి ఒక కొత్త విషయాన్ని చర్చించుకోవాలి. అదేమిటంటే పూరి ఒక హీరో కోసం కథ రాసుకుని అది ఆ హీరో తో చెయ్యడం కుదరకపోతే వేరే హీరోతో ఆ కథని చేసి హిట్స్ కొట్టేస్తుంటాడు. ఇలా ఒక హీరోకి రాసిన కథని మరో హీరోతో తీసిన పూరి ప్రతిసారి సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా పేరుతెచ్చుకున్నాడు.

కెరీర్ ఆరంభంలోనే పవన్ కళ్యాణ్ తో 'బద్రి' సినిమాని తెరకెక్కించి హిట్ కొట్టాక మళ్ళీ పవన్ కోసం చాలా కథలే తయారు చేసాడు పూరి. కానీ పవన్, పూరితో సినిమా చెయ్యడానికి పెద్దగా ఆసక్తి చూపలేదు. ఇక ఆ స్టోరీలను అప్పుడే ఇండస్ట్రీలో హీరోగా పేరు తెచ్చుకుంటున్న రవితేజతో చేసి ఆ చిత్రాలతో రవితేజ కెరీర్ ని నిలబెట్టాడు. ఆ చిత్రాలే... 'ఇడియట్, ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, అమ్మ నాన్న ఓ తమిళ్ అమ్మాయి'. ఇక ఆ చిత్రాలతో రవితేజ కి తిరుగులేని స్టార్ డమ్ వచ్చేసింది. టాలీవుడ్ లో హీరోగా నిలదొక్కున్నాడు. అలాగే 'పోకిరి' స్టోరీ ని కూడా మొదట్లో పూరి.. పవన్ కే వినిపించాడని వార్తలొచ్చాయి. అయితే పవన్ కి ఆ సినిమా చెయ్యడానికి ఏవో ఇబ్బందులు ఉండడంతో చెయ్యలేకపోయేసరికి... ఆ స్టోరీతో మహేష్ ని హీరోగా పెట్టి సినిమా చేసాడు. ఈ చిత్రంతో పూరి కి స్టార్ డైరెక్టర్ స్థానం మహేష్ కి టాలీవుడ్ టాప్ స్టార్ స్థానం ఒకేసారి దక్కాయి. ఇక మహేష్ కి టాలీవుడ్ లో తిరుగులేకుండా పోయింది. అలాగే మహేష్ తో చేసిన 'బిజినెస్ మ్యాన్' కథ కూడా పూరి మొదట తమిళ్ హీరో సూర్య కి వినిపించాడనే ప్రచారం జరిగింది. కానీ వాళ్ళ కాంబినేషన్ పట్టాలెక్కలేదు. ఆ కథని మహేష్ తో తెరకెక్కించి హిట్ కొట్టాడు పూరి. 

అలాగే ఈ మధ్యన చిరంజీవి కి 150 వ చిత్రం చెయ్యాలని పూరికి ప్రపోజల్ వచ్చినప్పుడు చిరు కోసం పూరి ఒక పవర్ ఫుల్ కథని రెడీ చేసినట్లు వార్తలొచ్చాయి. ఇంకా ఆ స్టోరీ కి టైటిల్ గా 'ఆటోజానీ' అని కూడా పెట్టేసాడు పూరి. ఇక 'ఆటోజానీ' టైటిల్ చిరు కి పక్కాగా సరిపోతుందని భావించి దాన్ని రిజిస్టర్ చేయించాడు. కానీ ఎందుకో ఏమో చిరు, పూరీని పక్కన పెట్టేసాడు. అలాగే మహేష్ కి 'జనగణమన' కథని వినిపించగా అది మహేష్ ఓకె చేసి మరీ తర్వాత పూరి పక్కకి తిరిగి చూడడం మానేసాడు. మరి 'జనగణమన' కథని ఏ హీరోతో చేస్తాడో గాని ఆ హీరో పంట పండినట్లే.

ఇక ఇప్పుడు పూరి.. బాలయ్య 101 సినిమా దర్శకుడిగా సెట్ అయ్యాడు. ఈ రోజు గురువారం బాలయ్య - పూరి కాంబినేషన్ చిత్రం  అధికారికంగా మొదలైపోయింది. మరి బాలకృష్ణతో పూరి 'ఆటోజానీ' కథనే చేయబోతున్నాడా? అనే అనుమానం ప్రతిఒక్కరిలో కలుగుతుంది. చిరు కాదన్న 'ఆటోజానీ' కథని పూరి, బాలయ్యతో తీస్తే.. పూరి సెంటిమెంట్ ప్రకారం బాలయ్య బ్లాక్ బస్టర్ హిట్ కొట్టినట్టే. ఓపెనింగ్ లో పూరి కాన్ఫిడెంట్ చూస్తుంటే..టాలీవుడ్ ఇండస్ట్రీ ఈ చిత్రం తో షేక్ అయ్యే లక్షణాలు పుష్కలంగా కనిపిస్తున్నాయంటున్నారు కొందరు సినీ విమర్శకులు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ