మణిరత్నం సినిమా వస్తుంది అంటే యూత్ అంతా ఎంతో ఇదిగా ఎదురు చూస్తారు. అయన తెలుగులో తన సినిమాలు డైరెక్ట్ చెయ్యడం ఆపేసినా... తమిళ్ లో చేసిన సినిమాలను తెలుగులోకి డబ్ చేస్తుంటాడు. ఆయన తెలుగులో డైరెక్ట్ సినిమాలు చెయ్యడం మానేసినా... ఆయన చిత్రాలు హిట్ అవ్వకపోయినా కూడా... మణిరత్నం కొత్త సినిమా వస్తుంది అంటే కుర్రకారుకి ఎక్కడాలేని క్రేజ్ వచ్చేస్తుంది. ఆయన చిత్రాలు అంత రొమాంటిక్ గా వుంటాయి మరీ. ఇకపోతే ఇప్పుడు మణిరత్నం తాజా చిత్రం 'చెలియా' డబ్బింగ్ రైట్స్ ని తెలుగులో దిల్ రాజు కొనుగోలు చేసాడు. మణిరత్నం ఈ చిత్రాన్ని కార్తీ హీరోగా అదితి రావ్ ని హీరోయిన్ గా పెట్టి తెరకెక్కిస్తున్నాడు.
తాజాగా ఈ చిత్ర ట్రైలర్ ని చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఈ 'చెలియా'లో కార్తీక్ ఫైలెట్ గా నటిస్తుండగా... అదితి రావ్ డాక్టర్ గా నటిస్తోంది. కార్తీ, అదితి రావ్ మధ్యన రొమాంటిక్ సన్నివేశాలతోపాటే కార్తీక్ వేరే దేశంతో యుద్ధంలో పాల్గొనే సన్నివేశాలను... కార్తీ, అదితి రావ్ తో కలిసి సాంగ్ పాడుతూ అల్లరిచేసే సన్నివేశాలతో ట్రైలర్ ని నింపేశారు. ఇక ఈ ట్రైలర్ ని చూస్తుంటే అన్నిరకాల ఎమోషన్స్ ఈ చిత్రాల్లో కనబడతాయని కమర్షియల్ గా వర్కౌట్ అవుతుందని అనిపిస్తుంది. మణిరత్నం గత చిత్రం 'ఓకె బంగారం' కూడా కేవలం రొమాన్స్, ఎమోషనల్ టచ్ తోనే సినిమా సైలెంట్ హిట్ కొట్టాడు. కానీ ఇప్పుడు 'చెలియా' మాత్రం కొంచెం ఎమోషనల్ డ్రామాతోపాటే రొమాంటిక్ సన్నివేశాలతో దేశభక్తికూడా కలగలిసి ఉంటుందనిపిస్తుంది. ఇక మణిరత్నం డైరెక్షన్లో రూపుదిద్దుకుంటున్న చెలియా చిత్రానికి ఏ ఆర్ రెహ్మాన్ సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే.