Advertisementt

భావన ను చూసి అంతా గర్వపడాలి..!

Fri 10th Mar 2017 01:29 PM
bhavana,bhavana actress,bhavana engagement,naveen  భావన ను చూసి అంతా గర్వపడాలి..!
భావన ను చూసి అంతా గర్వపడాలి..!
Advertisement
Ads by CJ

మలయాళం ముద్దుగుమ్మ భావనపై జరిగిన దాడి గురించి అందరికీ తెలిసిందే. భావనపై దాడి ఘటన భారతదేశమంతటా ప్రకంపనలు సృష్టించిన విషయం కూడా విదితమే. ఇంకా ఆ విషయాన్ని ఎవరూ మర్చిపోలేదు కూడానూ. విషయం ఏంటంటే... భావన పది రోజుల క్రితం కారులో వెళ్తుండగా, ఆమెను అడ్డగించి బలాత్కారం చేయబోయారన్న విషయం మీడియా వెల్లడించిన అంశం. అయితే పోలీసుల కథనం ప్రకారం.. భావనను వివస్త్రను చేసి సెమీ న్యూడ్ లో వీడియోలోకి ఎక్కించారని కూడా ఎప్ఫైఆర్ లో వెల్లడించినట్లు మళయాళం మీడియా వివరించింది. కానీ.. ఇంత జరిగిన భావన ఈ దుర్ఘటన నుండి చాలా త్వరగానే కోలుకున్నట్లుగా తెలుస్తుంది. జరిగిన విషయం పట్ల చాలా ఎక్కువ కాలం బాధపడకుండా,  చాలా ధైర్యంతో తక్కువ సమయంలోనే తేరుకొని ఆదర్శంగా నిలిచింది. ఈ విషయంలో భావనను చూసి గర్వపడటమే కాకుండా చాలా గుణపాఠంగా కూడా గ్రహించగలగాలి. ఇంకా ఈ విషయాలను పక్కనబెడితే  భావన కేవలం నాలుగు రోజుల్లోనే తిరిగి షూటింగ్ కు వచ్చి అందరినీ ఆశ్యర్య పరచడమే కాకుండా... అంతే త్వరగా నిశ్చితార్థం కూడా చేసేసుకొని అందరినీ విస్మయానికి గురిచేసింది. 

ఇంకా భావన ఈ ఘటన పట్ల సమాజం చిన్న చూపు చూస్తుందేమోనని బాధ పడకుండా సమాజానికే కనువిప్పు కలిగేలా వ్యవహరించింది. ఎంతో ధైర్యంతో బయటకు వచ్చి అదే ధైర్యంతో లైంగిక వేధింపులకు గురి చేసిన వారిని లీగల్ గా ఎదుర్కొంటూ యథావిధిగా తనపని తాను చేసుకుపోతుంది. అంతేకాకుండా అనతి కాలంలోనే ఆ ఘటనను పూర్తిగా మర్చిపోయేందుకు గతంలో రోమియో సినిమా నిర్మాతతో భావన ప్రేమాయణం సాగించినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అదే నిజం చేసే విధంగా నవీన్ అనే ఆ నిర్మాతతో భావన చాలా సింపుల్ గా నిశ్చితార్థం కూడా జరుపుకున్నట్లు తెలుస్తుంది. కాగా వీరిద్దరి వివాహం మాత్రం ఆగష్టులో జరగనున్నట్లు లభించిన ఆధారాల ద్వారా తెలుస్తుంది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ