Advertisementt

రామ్ గోపాల్ వర్మ అంతు చూస్తారంట..!

Fri 10th Mar 2017 11:12 AM
ram gopal varma,womens day,twitter,sunny leone  రామ్ గోపాల్ వర్మ అంతు చూస్తారంట..!
రామ్ గోపాల్ వర్మ అంతు చూస్తారంట..!
Advertisement
Ads by CJ

సోషల్ మీడియా సాక్షిగా సమయం సందర్భం లేకుండా రెచ్చిపోయే డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మకి ఇప్పుడు రోడ్డు మీదికొస్తే ఏం జరుగుతుందో చూపిస్తాం.. అని మహిళా సంఘాలు హెచ్చరిస్తున్నాయి. ఎప్పుడూ ఏదో ఒక విషయాన్ని బేస్ చేసుకుని సోషల్ మీడియాలో రెచ్చిపోయే వర్మ ఇప్పుడు తాజాగా మహిళా దినోత్సవం రోజున మహిళలను కించపరిచేలా మాట్లాడి మహిళా సంఘాల చేతిలో అడ్డంగా బుక్కయ్యాడు. 'మహిళలంతా సన్నీలియోన్‌లా సంతోషపరచాలి...' అంటూ ట్విట్టర్ లో పోస్ట్ చేసి వివాదానికి తెర తీసాడు. ఇక ఈ వ్యాఖ్యలపై వర్మపై కేసు కూడా బుక్కైంది. మహిళలందరికీ వర్మ క్షమాపణ చెప్పాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి  అయినా రామ్ గోపాల్ వర్మని మహిళా సంఘాలు ఎలా ఆడుకోవాలో అలా ఆడుకుంటామని హెచ్చరికలు జారీచేస్తున్నాయి. అయితే వర్మ మాత్రం నేను కేవలం సన్నీ లియోన్ నిజాయితీని, గౌరవాన్ని మాత్రమే అందరికి తెలిసేలా బహిరంగ పరిచానని ఇందువల్ల నా కుటుంబ సభ్యులు నన్ను గౌరవిస్తారని ట్విట్ చేసాడు. అసలు ఎప్పుడూ చిన్న లేదు పెద్ద లేదు అందరినీ ట్విట్టర్లో ఏకిపారేస్తూ ఆఖరికి ప్రధాని మోడీని కూడా ట్వీట్స్ తో చీల్చి చెండాడే రామ్ గోపాల్ వర్మ మాత్రం ఈ  మహిళా సంఘాల బెదిరింపులకు భయపడతాడా.. ఏంటి?

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ