Advertisementt

లోకేష్ చాలా పెద్దవాడయ్యాడు.!

Thu 09th Mar 2017 09:19 PM
lokesh,chandrababu naidu,mlc,lokesh property  లోకేష్ చాలా పెద్దవాడయ్యాడు.!
లోకేష్ చాలా పెద్దవాడయ్యాడు.!
Advertisement
Ads by CJ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుమారుడు నారా లోకేష్ ఎమ్మెల్సీ ఎన్నిక సందర్భంగా  ఆస్తులు చిట్టాను ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఆయనగారి ఆస్తులు అతి కొద్ది కాలంలోనే భారీగా పెరిగినట్లు తెలుస్తుంది. అంటే కేవ‌లం ఐదునెల‌ల వ్యవధిలోనే దాదాపు 23 రెట్లు పెరిగినట్లు స్వయంగా లోకేష్ ప్రకటించడం ఆయన నిజాయితీకి నిలువుటద్ధంగా చెప్పవచ్చు. ఎమ్మెల్సీ ఎన్నిక‌ల నామినేష‌న్ సందర్భంగా ఆయా నామినేషన్ ప‌త్రాల్లో లోకేష్ తాజా ఆస్తుల వివరాలను కూలంకషంగా లెక్కకట్టి మరీ వెల్లడించాడు. అందులో ఆయన ఆస్తులు మొత్తం విలువ రూ.330 కోట్లగా ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడ‌విట్‌లో తెలపడం చాలా విశేషం. ఇంకా చెప్పాలంటే.. ఇందులో రూ.273.84 కోట్లు హెరిటేజ్ షేర్లు కాగా,  స్థిరాస్తులు రూ.18 కోట్లు అని వార‌స‌త్వంగా వ‌చ్చిన‌ మొత్తం రూ.38.52 కోట్లుగా లోకేష్ వెల్లడించాడు. అయితే తన పేరిట ఇంకా రూ.6.27 కోట్లు అప్పులు ఉన్నట్టు  కూడా అఫిడవిట్ లో వెల్లడించాడు చినబాబు.

చినబాబు గ‌తం సంవత్సరం కూడా ఆస్తుల వివరాలను సమర్పించాడు. అవి ఎలా ఉన్నాయంటే.. గతేడాది అక్టోబ‌ర్ 19న లోకేష్ వెల్లడించిన లెక్కల మొత్తాన్ని చూసుకుంటే..  ఆ సమయానికి తన వద్ద ఉన్న ఆస్తుల విలువ‌ కేవలం రూ.14.5 కోట్లుగా వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే అప్పుడు ఇచ్చిన లెక్కల్లో  మాత్రం హెరిటేజ్ షేర్ల విలువ కేవ‌లం రూ.2.52 కోట్లుగా లోకేష్ వెల్లడించాడు. కాగా  హెరిటేజ్ ఫుడ్స్ త‌న రీటెయిల్ వ్యాపారాన్ని ఫ్యూచ‌ర్ రీటెయిల్ లిమిటెడ్‌కు అమ్మిన విషయం తెలిసిందే. అయితే కేవ‌లం 3.65 శాతం వాటా మాత్రమే హెరిటేజ్ పేరిట ఉంది. ప్రస్తుతం దాని విలువ రూ. 295 కోట్లుగా లోకేష్ తెలిపాడు.  ఇంకా చెప్పాలంటే... హెరిటేజ్‌లో లోకేష్ పేరిట ఉన్న షేర్ల విలువ ఇంతకు ముందు ఉన్న కేవలం రూ.2.52 కోట్లు ప్రస్తుతం రూ.273.84 కోట్లకు చేర‌డం ఎంతైనా విశేషంగా చెప్పవచ్చు. మొత్తానికి తొలిసారిగా ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికై రాజకీయ రంగంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా లోకేష్ ఆస్తులు మామూలుగా ప్రకటించలేదుగా. అందుకే లోకేష్ సంపదలో గతంలో కంటే చాలా తక్కువ సమయంలో చాలా పెద్దవాడయ్యాడనే చెప్పవచ్చు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ