Advertisementt

నయనతార పై మరో హాట్ న్యూస్..!

Thu 09th Mar 2017 08:51 PM
nayanthara,breakup,vignesh sivan,nayanthara love affairs  నయనతార పై మరో హాట్ న్యూస్..!
నయనతార పై మరో హాట్ న్యూస్..!
Advertisement
Ads by CJ

నయనతార గత రెండేళ్లుగా డైరెక్టర్ విగ్నేష్ శివన్ తో ప్రేమాయణం నడిపిస్తుంది. పీకల్లోతు ప్రేమలో.. వీరిద్దరూ ఒకే ఇంట్లో కలిసుంటున్నారని కోలీవుడ్ మీడియా కోడై కూసింది. ఎక్కడికి వెళ్లినా చెట్టాపట్టాలేసుకుని ఇద్దరూ జంటగా వెళుతుంటే ఇలాగే కదా అనుకునేది. ఇకపోతే నయన్ ఇంతకుముందే తమిళ హీరో శింబుతో ప్రేమాయణం నడిపి సడన్ గా బ్రేకప్ చేసుకుంది. ఇక శింబుతో బ్రేకప్ అయ్యాక సినిమాల్లో బిజీ అయింది. అలా సినిమాల్లో బిజీగా వున్నప్పుడే డైరెక్టర్ కమ్ కొరియోగ్రాఫర్ అయిన ప్రభుదేవాతో ప్రేమ పెళ్లి అంటూ రోడ్డెక్కింది. వీరిద్దరూ పెళ్ళికాకముందు సహజీవనం సాగించి పెళ్లి చేయుకుందామనుకున్న టైమ్ లో బ్రేకప్ చేసుకున్నారు. ప్రభుదేవాతో బ్రేకప్ అయ్యాక కూడా నయన్ మళ్ళీ సినిమాల్లో అవకాశాలు చేజిక్కించుకుంటూ స్టార్ హీరోయిన్ గా తమిళంలో హవా కొనసాగించింది.

ఇక ప్రభుదేవాతో బ్రేకప్ అయ్యాక మళ్ళీ ముచ్చటగా మూడో ప్రేమికుడిగా విగ్నేష్ శివన్ తో ప్రేమాయణం నడుపుతూ వార్తల్లోకొచ్చింది. అసలు సినిమాల్లో కన్నా ఎక్కువ పాపులారిటీ నయనతారకు ఈ ఎఫైర్ లతోనే వచ్చింది. నిత్యం ఏదో ఒక ప్రేమ వార్తతో వార్తల్లో వుండే నయన్ ఇప్పుడు విగ్నేష్ తో కూడా బ్రేకప్ చేసుకుందనే వార్త కోలీవుడ్ ఫిలిం సర్కిల్స్ లో హల్ చల్ చేస్తుంది. మరి విగ్నేష్ తో ఎందుకు బ్రేకప్ చేసుకుందో? అని అందరూ ఇదైపోతున్నారు. అసలు ఇప్పుడు విగ్నేష్ తో కలిసి ఒక ఇంట్లోనే వుండడం లేదట. విగ్నేష్ ఇంటిని వదిలి నయనతార హోటల్ కి మకాం మార్చిందని కోలీవుడ్ మీడియాలో కథనాలు ప్రసారం అవుతున్నాయి.

ఇప్పుడు నయన్ చేతిలో ఆరేడు సినిమాలు చేతిలో ఉండడంతో విగ్నేష్ ని కలిసే టైమ్ లేక నయన్ ఇలా హోటల్ లో ఉంటుందని నయనతార సన్నిహితులు చెబుతున్నప్పటికీ.. ఆమె విగ్నేష్ తో బ్రేకప్ కారణంగానే ఇలా బయటకొచ్చేసిందని అంటున్నారు. విగ్నేష్ తో వచ్చిన విభేదాల కారణంగానే నయన్ విడిగా ఉంటుందని అంటున్నారు. మరి ఇప్పటికే కోలీవుడ్ లో బిజీ తారగా వెలుగొందుతున్న నయన్ ఇప్పుడు బ్రేకప్ కారణంగా మరింత బిజీ అవుతుందని అప్పుడే సెటైర్స్ స్టార్ట్ అయ్యాయి. ఇంతకుముందు బ్రేకప్స్ అప్పుడు ఇలానే జరిగిందని వారు రుజువు కూడా చూపుతున్నారు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ