Advertisementt

మళ్ళీ టాలీవుడ్ లో బిజీ అయిన హీరోయిన్..!!

Wed 08th Mar 2017 11:23 PM
samantha,naga chitanya,love marriage,tollywood,big offers,ram charn,mahanati,raju gari gadhi 2,nagarjuna  మళ్ళీ టాలీవుడ్ లో బిజీ అయిన హీరోయిన్..!!
మళ్ళీ టాలీవుడ్ లో బిజీ అయిన హీరోయిన్..!!
Advertisement
Ads by CJ

సమంతకి 'జనతా గ్యారేజ్' తర్వాత టాలీవుడ్ లో అవకాశాలు లేకుండా పోయాయి. 'జనతా గ్యారేజ్' లో ప్రాధాన్యత లేని పాత్రలో నటించిన సమంత ఆ సినిమా తర్వాత నాగ చైతన్యతో వున్న రిలేషన్ బయటపడడంతో ఆమెకు అవకాశాలు తగ్గిపోయాయని ప్రచారం జరిగింది. నాగ చైతన్యతో ప్రేమ, పెళ్లితో బిజీ అయిన సమంత మరోవైపు కోలీవుడ్ చిత్రాలను ఒప్పుకుంటూ ఇటు టాలీవుడ్ లో మాత్రం అవకాశాలు లేక ఖాళీగా ఉండిపోయింది. అసలు అక్కినేని ఇంటికోడలికి ఎటువంటి కేరెక్టర్ ఇవ్వాలో తెలియక ప్రోడుసుర్స్ నుండి డైరెక్టర్స్ వరకు తలలు పట్టుకున్నట్లు వార్తలొచ్చాయి.

కానీ నాగ చైతన్యతో జనవరిలో ఎంగేజ్మెంట్ అయ్యిందో.. లేదో.. టాలీవుడ్ లో వరుస ఆఫర్స్ తో మళ్ళీ లైన్లోకొచ్చేసింది సమంత. ముందుగా నాగార్జున తో 'రాజుగారి గది 2 'లో కీలక పాత్ర చేస్తున్న సామ్, రామ్ చరణ్ కి జోడిగా మొదటిసారి సుకుమార్ డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తుంది. ఇక ఇప్పుడు తాజాగా ఆమె 'మహానటి'లో నటించనున్నట్లు ఈ రోజు మహిళా దినోత్సవం సందర్భం గా విడుదల చేసిన 'మహానటి' పోస్టర్స్ తో కన్ఫర్మ్ అయ్యింది. మరి ఇప్పటికే 'రాజుగారి గాడి 2 ' సెట్ లో సందడి చేస్తున్న సమంత ఇంకొన్ని రోజుల్లో రామ్ చరణ్ చిత్ర షూటింగ్ లో జాయిన్ అవనున్నట్లు ఆ చిత్ర యూనిట్ తెలిపింది. ఇక 'మహానటి' కూడా ఆఫీసియల్ గా సెట్స్ మీదకెళ్ళిపోతే సమంత హవా మరోసారి టాలీవుడ్ లో మొదలైనట్లే అని అంటున్నారు. మరి కొంతకాలంగా అవకాశాలు లేక చతికిలపడిన సామ్ ఒక్కసారిగా వచ్చిన ఆఫర్స్ తో ఉబ్బితబ్బిబ్బవుతోందని అంటున్నారు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ