Advertisementt

'కింగ్ ఈజ్ బ్యాక్' కి అర్ధమిదేనా... నాగ్!!

Thu 09th Mar 2017 03:44 PM
nagarjuna,amala,tweets,akhil marriage,king is back,womens day special tweet  'కింగ్ ఈజ్ బ్యాక్' కి అర్ధమిదేనా... నాగ్!!
'కింగ్ ఈజ్ బ్యాక్' కి అర్ధమిదేనా... నాగ్!!
Advertisement
Ads by CJ

నాగార్జునని 'ఓం నమో వెంకటేశాయ' సినిమా నిరాశపరచడం, అఖిల్ పెళ్లిని రద్దు చేసుకోవడం తో బాగా డిప్రెషన్లోకి వెళ్లాడని... షూటింగ్స్ కి బ్రేక్ ఇచ్చేసి వ్యాపారాన్ని పక్కన పెట్టేసి అజ్ఞాతవాసం గడుపుతున్నాడని సోషల్ మీడియాలో ఒకటే ప్రచారం జరిగింది. మరి మీడియా ప్రచారమని కాదుగాని నాగ్ గత పది రోజులుగా ఎవ్వరికి దొరక్కుండా మొఖం చాటేసిన విషయం నిజమెమరీ.  నాగ్ సన్నిహితుల నుండి తప్పించుకోవడానికి ఫోన్ నంబర్ కూడా మార్చేసాడనే వార్తలు హల్ చల్ చేశాయి. 

అయితే తాజాగా నాగార్జున 'కింగ్ ఈజ్ బ్యాక్' అంటూ.... సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడు. అలాగే వ్యాపారాన్ని కూడా చూసుకుంటున్నాడు. ఇక అఖిల్ కూడా తన రెండో సినిమా షూటింగ్ కి ప్రిపేర్ అవుతున్నాడని సమాచారం. అలాగే నాగ్ వైఫ్ అమల కూడా ఎప్పటిలాగానే తన పనుల్లో నిమగ్నమైపోయింది. ఇక నాగార్జున  కూడా సోషల్ మీడియాలో యాక్టీవ్ అయ్యాడు. మహిళా దినోత్సవం సందర్భం గా నాగార్జున అమల కి నారి శక్తి పురస్కారం రావడం చాలా ఆనందంగా ఉందని ట్వీట్ చేసాడు. అమల సమాజం కోసం చేసిన నిస్వార్ధ సేవలను గుర్తించి ఈ పురస్కారం ఇవ్వడం తనకెంతో గర్వం గా ఉందని ట్వీట్ చేసాడు. ఇంకా రాష్ట్రపతి చేతులమీదుగా అమల నారి శక్తి పురస్కార్-2016 అందుకోవడం తనకి సంతోషాన్నిచిందని పేర్కొన్నాడు.

మరి నాగ్ ఇలా యాక్టీవ్  గా మారడంతో అక్కినేని అభిమానులు ఫుల్ జోష్ లో మునిగిపోయారు. అన్ని సమస్యలను అధిగమించి ఇలా నాగార్జున ఎప్పుడూ హ్యాపీగా ఉండాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ